మాజీ మంత్రి నారాయణ ఇంటికి ఏపీ సీఐడీ పోలీసులు వెళ్లారు.రాజధాని అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్డు మాస్టర్ ప్లాన్ కేసులో భాగంగా సీఐడీ విచారణ కొనసాగుతోంది.
ఇందులో భాగంగా నారాయణ నివాసానికి వెళ్లిన సీఐడీ పోలీసులు ఆయన స్టేట్ మెంట్ ను రికార్డ్ చేశారు.ఇటీవల నారాయణకు శస్త్ర చికత్స అయిన నేపథ్యంలో సీఐడీ కార్యాలయానికి రావడం ఇబ్బందిగా ఉంటుందన్న అభిప్రాయంతో కోర్టు ఆయనను ఇంటి వద్దే అధికారులు విచారించాలని తెలిపింది.