1.సెప్టెంబర్ 2 నుంచి ఇంజినీరింగ్ క్లాసులు
వచ్చే విద్యా సంవత్సరం కు సంబంధించి సెప్టెంబర్ 15 నుంచి ఇంజినీరింగ్ క్లాసులను నిర్వహించాలని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి స్పష్టం చేసింది.
2.ఏవీవీపీ ధర్నా
హైదరాబాద్ కలెక్టరేట్ ఏబీ వీపీ కార్యకర్తలు ధర్నాకు దిగారు.
3.నేడు రాష్ట్ర స్థాయి వెటరన్ అథ్లెటిక్స్ పోటీలు ప్రారంభం
నేడు మాస్టర్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి వెటరన్ అథ్లెటిక్స్ పోటీలు ప్రారంభం కానున్నాయి.హనుమకొండ జె ఎన్.ఎస్ ఆధ్వర్యంలో ఈ క్రీడలను మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ ప్రారంభిస్తారు.
4.యాదాద్రి లో మహా కుంభ సంప్రోక్షణం
యాదాద్రి లో మహా కుంభ సంప్రోక్షణం ఆరో రోజు నిర్వహిస్తున్నారు.
5.మల్లన్న సేవలో తెలంగాణ మంత్రి
తెలంగాణ మంత్రి హరీష్ రావు ఈ రోజు శ్రీ శైలం రానున్నారు.శ్రీశైలం శ్రీ బ్రమరాంభిక మల్లికార్జున స్వామి వారి ని దర్శించుకోనున్నారు.
6.హైటెక్స్ లో మెడికల్ ఎక్స్ పో
హైటెక్స్ లో నేడు మెడికల్ ఎక్స్ పో ను ప్రారంభించారు.ఆదివారం వరకు జరుగుతున్న ఈ ఎక్స్ పో లో ఆసుపత్రులకు సంబంధించిన మెడికల్ పరికరాలు అన్నీ అందుబాటులో ఉండనున్నాయి.
7.రఘురామ కామెంట్స్
ఏపీ ఆర్థిక అరాచకం అంతా మాయని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది అనడానికి నిదర్శనం అని ఏపీ ప్రభుత్వం ను వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు విమర్శించారు.
8.నరసాపురాన్ని జిల్లా కేంద్రం చేయాలి
నరసాపురం ను జిల్లా కేంద్రం చేయాలని మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.
9.ఏపీకే కేంద్రం ఎక్కువ నిధులు కేటాయించింది
ఏపీకే కేంద్రం ఎక్కువ నిధులు కేటాయించింది అని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు.
10.విశాఖ రైల్వే జోన్ క్రెడిట్ బీజేపీదే
విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు బిజెపి వల్లే సాధ్యమైందని ఆ క్రెడిట్ అంత తమ పార్టీదేనని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు.
11.నారా లోకేష్ విమర్శలు
ఏపీని రావణకాష్టం చేసేందుకు జగన్ రెడ్డి , ఆయన పార్టీ నేతలు కంకణం కట్టుకున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు.
12.అచ్చన్న కు చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు
ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చన్నకు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
13.కిషన్ రెడ్డిపై నిరంజన్ రెడ్డి హాట్ కామెంట్స్
కిషన్ రెడ్డి చచ్చేవరకు కేంద్రమంత్రిగా ఉంటారా ఒడ్లు కొనాలని కిషన్ రెడ్డి ఎందుకు చెప్పడం లేదని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు.
14.ఏపీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు ముహూర్తం ఖరారు
ఆంధ్ర ప్రదేశ్ క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ పై ఎప్పటినుంచో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.ఏప్రిల్ 11వ తేదీన కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం చేయించేందుకు జగన్ ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం.
15.నేటి నుంచి ఐపీఎల్
నేటి నుంచి ఐపీఎల్ సీజన్ 15 ప్రారంభం కానుంది.
16.అంతర్జాతీయ విమానాలు రాకపోకలకు గ్రీన్ సిగ్నల్
అంతర్జాతీయ విమానాల రాకపోకలకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఈ నేపథ్యంలో నేటి నుంచి ఇతర దేశాలకు విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి.
17.నేడు శ్రీశైలంకు ఏపీ హైకోర్టు సీజే
నేడు శ్రీశైలం కి ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా రానున్నారు.రేపు శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల ను ఆయన దర్శించుకోనున్నారు.
18.నేటినుంచి టెట్ దరఖాస్తుల స్వీకరణ
నేటి నుంచి తెలంగాణలో టెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది.
19.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 48,200 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 52,590
.