1.ఎంసెట్ కౌన్సిలింగ్ 6 నుంచి
తెలంగాణలో ఇంజినీరింగ్ , ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహిస్తున్న ఎంసెట్ కౌన్సిలింగ్ కు సంబందించిన షెడ్యూల్ ను ఉన్నత విద్య మండలి విడుదల చేసింది.నవంబర్ 6 నుంచి ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రారంభం కానున్నట్లు తెలిపింది.
2.కోహ్లీకి బెదిరింపుల పై విచారణ
టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కుటుంబానికి ఆన్లైన్ లో బెదిరింపులు వచ్చినట్టుగా వచ్చిన వార్తలపై సుమోటగా తీసుకున్నట్టు ఢిల్లీ మహిళా కమీషన్ పేర్కొంది.
3.అమరావతి రైతుల మహా పాదయాత్ర
ఏపీ రాజధాని గా అమరావతిని కొనసాగించాలని కోరుతూ ఆ ప్రాంత రైతులు, మహిళలు చేపట్టిన మహా పాదయాత్ర 3 వ రోజుకి చేరుకుంది.
4.పంచ్ ప్రభాకర్ ను అరెస్ట్ చేయాల్సిందే
న్యాయమూర్తులను కించపరుస్తూ అభ్యంతకర రీతిలో పోస్ట్ లు పెట్టిన పంచ్ ప్రభాకర్ ను అరెస్ట్ చేయాల్సిందే అని ఏపీ హై కోర్టు సీబీఐ కు గడువు ఇచ్చింది.
5.మోదీ ఫోటో పై కేరళ కోర్టు స్పందన
కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికేట్ నుంచి ప్రధాన మంత్రి మోదీ ఫోటో తొలగించాలని కోరడం ప్రమాదకర మైన అలోచన అని కేరళ హై కోర్ట్ తెలిపింది.
6.బాబు పవన్ పై వైసీపీ ఎంపీ విమర్శలు
టిడిపి అధినేత చంద్రబాబు ,లోకేష్ ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ ఎంపీ నందిగామ సురేష్ కామెంట్స్ చేశారు.వీరందరూ హైదరాబాదులో మొఖం ఉంటూ ఏపీకి విహారయాత్రకు వస్తున్నారు అంటూ ఆయన విమర్శించారు.
7.ఏపీలో మరో కొత్త శాఖ ఏర్పాటు
ఏపీలో మరో కొత్త శాఖను ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల పేదల సంక్షేమం కోసం ప్రత్యేక శాఖ ను ఏర్పాటు చేశారు.
8.పునీత్ రాజ్ కుమార్ ఫ్యామిలీని పరామర్శించిన రామ్ చరణ్
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఇటీవల గుండె పోటు తో మరణించడం తో ఆయన కుటుంబాన్ని రామ్ చరణ్ పరామర్శించారు.
9.రేపు తెలంగాణలో వాక్సిన్ హాలిడే
రేపు తెలంగాణలో వాక్సిన్ హాలిడే ప్రకటిస్తూ తెలంగాణా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
10.రవి తేజ 71 వ సినిమా టైటిల్ ప్రకటన
మాస్ మహారాజా రవితేజ 71 వ చిత్రం టైటిల్ ను ” టైగర్ నాగేశ్వరరావు ” గా చిత్ర యూనిట్ ప్రకటించింది.
11.దాసరి నివాసానికి సిటీ సివిల్ కోర్టు నోటీసులు
ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు నివాసానికి సిటీ సివిల్ కోర్టు నోటీసులు జారీ చేసింది.O ప్లాంట్ నిర్మాణం నిమిత్తం దాసరి కుమారులు అరుణ్, ప్రభులు తన దగ్గర 2.11 కోట్లు తీసుకున్నారని సిటీ సివిల్ కోర్టు లో గుంటూరు జిల్లా కు చెందిన అట్లూరి సోమ శేఖర రావు సిటీ సివిల్ కోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు.
12.గాంధీ భవన్ లో పీసీసీ భేటీ
గాంధీ భవన్ లో పీసీసీ సమావేశం కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాకూర్ ఆధ్వర్యంలో మొదలయ్యింది.
13.భిమ్లా నాయక్ అప్డేట్
పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్న భిమ్ల నాయక్ నుంచి మరో అప్ డేట్ వచ్చింది.ఈ చిత్రం నుంచి ‘ లాల్ భీమ్లా ” సాంగ్ ప్రోమో ను రాత్రి 7.02 నిమిషాలకు విడుదల చేస్తారు.
14.టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు పై కేసు నమోదు
టిడిపి తెలుగుదేశం శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు పై శ్రీకాకుళం జిల్లా టెక్కలి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.
15.శ్రీవారి సేవలో హీరో విశాల్
యంగ్ హీరో విశాల్ ఈ రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
16.భారత్ లో కరోనా
గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 11,903 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
17.తెరుచుకోనున్న శబరిమలై ఆలయం
ఈ నెల 15 తరువాత శబరిమలై అయ్యప్ప ఆలయం తెరుచుకోనుంది.
18.1100 థియేటర్లలో రానున్న రజనీ సినిమా
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ” అన్నత్తే ‘ సినిమాను 1100 థియేటర్లలో విడుదల కానుంది.
19.జమ్మూ కాశ్మీర్ కు మోదీ
జమ్మూ కాశ్మీర్ కు ప్రధాని నరేంద్ర మోదీ గురువారం రానున్నారు.
20.ఈ రోజు బంగారం ధరలు
22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 46,700 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర -47,750