న్యూస్ రౌండప్ టాప్ 20

1.భారత్ లో కరోనా

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 3,47,254 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

 Ap And Telangana News Headlines, Breaking News, Top20 News, Roundup, Today Gold-TeluguStop.com

2.కేరళలో వారాంతపు లాక్ డౌన్

కేరళలో కరోనా  వైరస్ విజృంభిస్తుండడంతో ప్రతి ఆదివారం లాక్ డౌన్ విధించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించుకుంది.

3.శ్రీవారి సేవలో నాగార్జున అమల

ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున ఆయన సతీమణి అమల శుక్రవారం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.

4.ఏపీ కేబినెట్ సమావేశం

ఏపీ కేబినెట్ సమావేశం ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది.ఈ సమావేశంలో అనేక కీలకాంశాలు చర్చ జరుగుతోంది.

5.పరీక్షల విభాగం డైరెక్టర్ గా కృష్ణారావు

పదో తరగతి పరీక్షల విభాగం డైరెక్టర్ గా కృష్ణా రావు నియమిస్తూ తెలంగాణ పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ దేవసేన ఉత్తర్వులు జారీ చేశారు.

6.రేపు, ఎల్లుండి కొన్ని ఎంఎంటీఎస్ రైళ్ల రద్దు

నిర్వహణ లోపం కారణంగా ఈనెల 22 23 తేదీల్లో కొన్ని ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.

7.తిరుమల సమాచారం

తిరుమల లో భక్తుల రద్దీ కొనసాగుతోంది.గురువారం తిరుమల శ్రీవారిని 36,092 మంది భక్తులు దర్శించుకున్నారు.

8.బోండా ఉమా కారు ధ్వంసం

టీడీపీ కార్యాలయంతోపాటు టీడీపీ  సీనియర్ నేత బోండా ఉమా కారును వైసీపీ శ్రేణులు ధ్వంసం చేయడాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఖండించారు.

9.ఈనెల 25 వరకు రేషన్ తీసుకోవచ్చు

తెలంగాణలో రేషన్ సరుకుల ను ఈనెల 25వ తేదీ వరకు తీసుకునే వెసులుబాటు కల్పించినట్లు పౌరసరఫరాల ఎన్ఫోర్స్మెంట్ డిటి రఘునందన్ తెలిపారు.

10.జిహెచ్ఎంసి పరిధిలో కరోనా కేసులు

జిహెచ్ఎంసి పరిధిలో మొత్తం 1645 కేసులు నమోదయ్యాయి.

11.ఏపీ ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు

విశాఖ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఏపీ ఎక్స్ ప్రెస్ రైలులో లో మంటలు చెలరేగాయి.  ఎస్ 6 భోగి లో ఒక్కసారిగా పొగలు రావడంతో నెక్కొండ స్టేషన్ లో డ్రైవర్ అప్రమత్తం రైలును నిలిపివేశారు.

12.25న దక్షిణాది రాష్ట్రాల బీసీ మహాసభ

ఆంధ్ర ప్రదేశ్ లో చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఈనెల 25న దక్షిణాది రాష్ట్రాల బీసీ మహాసభ జరపాలని నిర్ణయించినట్టు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య తెలిపారు.

13.ఉద్యోగ సంఘాల నేతల భేటీ

అమరావతిలోని ఎన్జీవో హోం లో ఉద్యోగ సంఘాల నేతలు భేటీ అయ్యారు పిఆర్సి పై  ప్రభుత్వంతో దేనికైనా సిద్ధమంటూ ప్రకటన చేశారు.

14.నేడు విశాఖకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి

కేంద్ర చమురు శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ .ఐ ఐ పి ఈ తొలి స్నాతకోత్సవంలో పాల్గొనబోతున్నారు.

15.తెలంగాణలో ఫీవర్ సర్వే

తెలంగాణలో నేటి నుంచి ఫీవర్ సర్వే ప్రారంభమైంది.

16.ప్రివిలేజ్ కమిటీ ముందుకు బండి సంజయ్

నేడు ప్రివిలేజ్ కమిటీ ముందుకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ హాజరుకానున్నారు.

17.తెలంగాణలో కరోనా

గడచిన 24 గంటల్లో తెలంగాణవ్యాప్తంగా కొత్తగా 4,207 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

18.బండి సంజయ్ కు మంత్రి సత్యవతి రాథోడ్ సవాల్

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు మంత్రి సత్యవతి రాథోడ్ సవాల్ విసిరారు.గిరిజనులకు కేంద్ర బీజేపీ  ప్రభుత్వం ఏమైనా చేసిందా అనే విషయం చెప్పాలని సవాల్ విసిరారు.

19.షర్మిల కామెంట్స్

తెలంగాణ సీఎం కేసీఆర్ పై వైఎస్సార్ టిపి అధ్యక్షురాలు షర్మిల విమర్శలు చేశారు.ట్విట్టర్ వేదికగా రైతుల పంట నష్టం పై ఆమె టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీశారు.

20.ఈరోజు బంగారం ధరలు

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 47,640

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 49,640

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube