1.అవినాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

మాజీమంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు పై ఎంపీ అవినాష్ రెడ్డి( MP Avinash Reddy ) స్పందించారు.వివేక హత్య జరిగిన రోజు ఏం జరిగిందో ప్రజలకు తెలియాలని అన్నారు.వివేకా మరణించినట్లు శివప్రకాష్ రెడ్డి తనకు చెప్పారని అవినాష్ రెడ్డి అన్నారు.
2.రామనవమి హింసపై ఎన్ ఐ ఏ విచారణ
పశ్చిమ బెంగాల్లో జరిగిన రామనవమి హింసా కాండ పై కొల్ కతా హైకోర్టు ఎన్ఐఏ విచారణకు ఆదేశించింది.
3.కర్ణాటక ఎన్నికల పై ప్రధాన స్పందన

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి( BJP ) రికార్డు మెజారిటీ సాధిస్తుందని ప్రధాన నరేంద్ర మోది జోస్యం చెప్పారు.
4.అమిత్ షా పై కాంగ్రెస్ నేతల ఫిర్యాదు
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ప్రచారంలో కాంగ్రెస్ నేతలు ఫిర్యాదులకు తెర తీశారు.కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచారంలో భాగంగా ద్వేషపూరిత ప్రసంగాలు చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
5.సెంట్రల్ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు

చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది.దీంతో అప్రమత్తమైన పోలీసులు రైల్వేస్టేషన్ ఆవరణలో తనిఖీ చేపట్టారు.
6.బీఆర్ఎస్ జనరల్ బాడీ మీటింగ్
నేడు బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ జనరల్ బాడీ మీటింగ్ జరుగుతుంది.
7.ఢిల్లీ వెళ్లిన గవర్నర్

తమిళనాడు గవర్నర్ ఆర్ ఎన్ రవి( Governor RN Ravi ) ఆకస్మికంగా ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.మూడు రోజుల పర్యటన నిమిత్తం ఆయన వెళ్లినట్లు గవర్నర్ కార్యాలయ వర్గాలు పేర్కొన్నాయి .ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ తో భేటీ కానున్నారు.
8.చంద్రబాబు రోడ్ షోలో గాయపడిన వ్యక్తి మృతి
టిడిపి అధినేత చంద్రబాబు పల్నాడు జిల్లా రోడ్ షోలో గాయపడిన ఆ పార్టీ కార్యకర్త అడుసుమిల్లి వెంకటేశ్వర్లు ఈరోజు తెల్లవారుజామున మృతి చెందారు.
9.తిరుమల సమాచారం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.నేడు శ్రీవారి దర్శనం కోసం రెండు కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
10.వేలిముద్రల విభాగానికి ఆధునిక పరికరాలు
కేసుల పరిష్కారంలో కీలకమైన ఫింగర్ ప్రింట్ బ్యూరోకు ఆధునిక పరికరాలతో కూడిన కిట్స్ సమకూర్చినట్లు సిఐడి చీఫ్ మహేష్ భగవత్ తెలిపారు.
11.ఎడ్ సెట్ దరఖాస్తు గడువు పొడగింపు

ఎడ్ సెట్ దరఖాస్తుల సమర్పణ గడువును పొడిగిస్తున్నట్లు తెలంగాణ ఎడ్ సెట్ కన్వీనర్ రామకృష్ణ తెలిపారు.మే 1 వరకు ఈ గడువును పొడిగించారు.
12.జేఎన్టీయూలో సైకాలజికల్ కౌన్సిలింగ్ సెంటర్
మానసిక సమస్యలు ఎదుర్కొంటున్న విద్యార్థులు, ఉద్యోగులకు ఉచితంగా వైద్యులతో కౌన్సిలింగ్ ఇప్పించేందుకు జేఎన్టీయూ లో సైకాలజికల్ కౌన్సిలింగ్ సెంటర్ ను ఏర్పాటు చేసినట్లు వీసీ కట్టా నరసింహారెడ్డి( VC Katta Narasimha Reddy ) అన్నారు.
13.బీసీ బంధు ను అమలు చేస్తాం
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బీసీ బంధు పథకం తెస్తామని కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.
14.నేడు టిఆర్ఎస్ మినీ ప్లీనరీ

టిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని తెలంగాణ భవన్ లో ఆ పార్టీ మినీ ప్లీనరీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
15.ఆర్టిజన్ ల సమ్మె విరమణ
వేతన సవరణ చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యమిస్తున్న ఆర్ట్ జన్ లు సమ్మెను విరమించారు.
16.టీయూ వి సి నిర్ణయాలపై విచారణ
నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రవీందర్ గుప్తా గత 11 నెలల కాలంలో తీసుకున్న నిర్ణయాలను సమీక్షించాలని వర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నిర్ణయించింది.
17.కాశీలో తానా జల వితరణ
తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ఫౌండేషన్ కాశీ విశ్వనాథ ఆలయంలోని భక్తులకు 25వేల వాటర్ బాటిళ్ల ను విరాళంగా అందించింది.
18.సిపిఐ రామకృష్ణ విమర్శలు

దేశంలో బిజెపిని, రాష్ట్రంలో వైసిపిని ఇంటికి సాగనంపడానికి కమ్యూనిస్టులు పోరాటాలకు నడుం బిగించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పిలుపునిచ్చారు.
19.స్టీల్ ప్లాంట్ పై హైకోర్టుకు కేఏ పాల్
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను నామమాత్రకు ధరకు అమ్మకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
20.ఋషికొండపై మే 4న తుది విచారణ
విశాఖలో ఋషికొండలో అనుమతులకు మించి అక్రమంగా తవ్వకాలు జరిపి నిర్మాణాలు జరుపుతున్నారంటూ దాకలైన వ్యాజ్యంపై మే 4 న తుది విచారణ చేపడుతామని హైకోర్టు తెలిసింది.