మీ గెలుపుని మన కూతురు బాగా ఆస్వాదిస్తోంది : అనుష్క శర్మ

ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా విరాట్ కోహ్లీ పేరు మారుమోగిపోతుంది.తాజాగా మెల్ బోర్న్ వేదికగా జరిగిన మ్యాచ్ లో టీమిండియా దాయాది జట్టుపై అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే.4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.ఇక విరాట్ కోహ్లీ చెలరేగిపోయాడు.

 Anushka Sharma Posted An Emotional Post-on Virat Kohlis Performance In The India-TeluguStop.com

కాగా ఈ మ్యాచ్ పై బాలీవుడ్ నటి విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ స్పందిస్తూ ఎమోషనల్ గా ట్వీట్ చేసింది.ఈ సందర్భంగా ఆమె సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తూ.

టీమ్ ఇండియా జట్టు విజయంతో దేశ ప్రజలకు ముందుగానే దీపావళి పండుగ వచ్చింది.

క్రికెట్ ప్రేమికుల కళ్లల్లో నిజమైన దీపావళి వెలుగులు కనిపించాయి అంటూ ఆమె ప్రశంసించింది.

మీరు చాలా అద్భుతంగా ఆడారు.మీ పట్టుదల, సంకల్పం, నమ్మకం మనస్సులను కదిలించాయి.

నా జీవితంలో అత్యుత్తమ మ్యాచ్‌ ని ఇప్పుడే చూశాను.అలాగే మన పాప వామిక మ్యాచ్ చూసి గదిలో డ్యాన్స్ వేస్తోంది.

అర్థం చేసుకునే వయసు కానప్పటికీ విపరీతంగా ఎంజాయ్ చేస్తోంది.తన తండ్రి అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడాడని ఆమె అర్థం చేసుకుంది.

నిలకడ లేదని నీపై వచ్చిన వార్తలను చెక్ పెడుతూ సాధించిన ఈ విజయం అపూర్వం.

ఈ గెలుపుతో మీరు మరింత బలంగా తయరవ్వాలని కోరుకుంటున్నాను అంటూ అనుష్క శర్మ ఎమోషనల్ గా పోస్ట్ చేసింది.కాగా ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవడంతో ఆ ట్వీట్ పై స్పందించిన పలువురు నెటిజెన్స్ విరాట్ కోహ్లీ హై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.అయితే అభిమానులతో పాటు పలువురు సెలబ్రిటీలు సైతం విరాట్ కోహ్లీ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

అంతే కాకుండా విరాట్ కోహ్లీ పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోయేలా చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube