మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ప్రస్తుతం మహేష్ తో సినిమా చేస్తున్నాడని తెలిసిందే.ఎస్.
ఎస్.ఎం.బి 28వ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుని సెకండ్ షెడ్యూల్ కి రెడీ అవుతుంది.ఈ సినిమాని అసలైతే 2023 ఏప్రిల్ లో రిలీజ్ ఫిక్స్ చేశారు.
ఇక ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా ప్లానింగ్ లో ఉంది.పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ చేసే సినిమా త్రివిక్రమ్ తోనే అని దాదాపు కన్ఫర్మ్ అయినట్టు ఉంది.
ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ తో పాటుగా మరో హీరో కూడా నటిస్తాడని తెలుస్తుంది.

సినిమాలో అల్లు అర్జున్ తో పాటుగా మరో ఇంపార్టెంట్ రోల్ కి బాలీవుడ్ యంగ్ హీరో ఒకరిని తీసుకోతున్నారని తెలుస్తుంది.ఈ సినిమాని ఎలాగు పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తుండగా పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ రేంజ్ మరింత పెంచేలా కథ సిద్ధం చేస్తున్నారట త్రివిక్రమ్.ఆల్రెడీ ఈ కాంబోలో హ్యాట్రిక్ హిట్లు ఉండగా నాలుగవ సినిమాగా వస్తున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
ఇక మీదట అల్లు అర్జున్ తన ప్రతి సినిమా కూడా నేషనల్ లెవల్లో ప్లాన్ చేస్తున్నాడు.