నంద్యాల జిల్లా శ్రీశైలం పుణ్యక్షేత్రంలో మరో వివాదం నెలకొంది.అభిషేకాల పేరుతో పాలకమండలి సభ్యులు సరికొత్త దందాకు తెర తీసినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో పాలకమండలి సభ్యురాలికి సంబంధించిన ఆడియో కలకలం రేపుతోంది.మల్లన్న స్వామికి అభిషేకాలు, స్పర్శ దర్శనాలు పేరుతో దోపిడీకి పాల్పడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అదేవిధంగా స్వామివారి గర్భాలయ టికెట్లు లేకపోయినా దర్శనాలు చేయిస్తామంటున్న ధర్మకర్తల మండలి సభ్యురాలు చెబుతున్న ఆడియో తీవ్ర కలకలం సృష్టిస్తుంది.దీంతో ఆలయ పాలకమండలి తీరుపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.