నెల్లూరు లో ఆసక్తికరంగా మారిన అన్నదమ్ముల రాజకీయం!

రాజకీయాల్లో సోదర సోదరీమణులు భాగస్వాములుగా ఉండడం మామూలే.అయితే సహజంగా ఇద్దరూ ఒకే పార్టీలో ఉండడమే జరుగుతూ వస్తుంది.

 Brothers Political Rivalry In Nellore Beeda Mastan Rao Beeda Ravindra Details, B-TeluguStop.com

ఉదాహరణకు ఉమ్మడి ప్రకాశంలో దామచర్ల జనార్ధన్, సత్య లు టిడిపిలోనే కొనసాగుతున్నారు.అలాగే శ్రీకాకుళంలోని టిడిపి పార్టీలో ప్రతిభా భారతి, గ్రీష్మ లు కూడా అలాగే ఉన్నారు.

అయితే వైసీపీ పరిస్థితి మాత్రం ఇప్పుడు అందుకు భిన్నంగా తయారయింది.నెల్లూరు జిల్లాలోని బీద సోదరులతో వీరికి చిక్కు వచ్చి పడింది.విషయం ఏమిటంటే బీద మస్తాన్ రావు గతి ఎన్నికల వరకు టిడిపిలోనే ఉన్నారు.ఎంపీ స్థానానికి పోటీ చేసి పరాజయం పాలయ్యాడు.

అయితే వెంటనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి రాజ్యసభ సీటు కూడా చేజెక్కించుకున్నాడు.

Telugu Beeda Brothers, Beeda Ravindra, Cmjagan, Kavali, Nellore, Nellore Ycp, Ys

ఇవతల బీద రవీంద్ర స్టోరీ మాత్రం వేరే.రవీంద్ర ఎప్పటి నుండో టిడిపిలోనే నిజాయితీగా కొనసాగుతున్నాడు.పైగా జిఎంఆర్ సంస్థ అధినేత బీద మస్తాన్ రావు తమ్ముడు.

అలాగే వ్యాపారాల్లో ఆయనకి కూడా భాగస్వామ్యం ఉంది.ఇటుపక్క అతను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడుగా కొనసాగుతున్నాడు.

బీద మస్తాన్ రావుకు స్థానికంగా చాలా మంచి పేరు ఉంది.గతంలో టిడిపి పార్టీ తరఫున కావలి ఎమ్మెల్యేగా కూడా పనిచేశాడు.కాబట్టి ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లో బీదను ఉపయోగించుకునే యోజనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది.టికెట్ పై సందిగ్ధత నెలకొన్నప్పటికీ నెల్లూరు జిల్లా అంతటా పెద్దన్న పాత్ర పోషించమని ఆదేశించే అవకాశాలు ఉన్నాయట.

Telugu Beeda Brothers, Beeda Ravindra, Cmjagan, Kavali, Nellore, Nellore Ycp, Ys

నెల్లూరు జిల్లాలో మళ్లీ వైసీపీ క్లీన్ స్వీప్ చేసే బాధ్యతలను బీద మస్తాన్ రావుకి ఇచ్చే ఆలోచనలు జగన్ ఉన్నట్లు తెలుస్తోంది.అయితే మరోవైపు తెలుగుదేశం పార్టీ కూడా కొన్ని ముఖ్యమైన స్థానాల్లో ఎట్టి పరిస్థితుల్లో వారు గెలవాలని ఆ బాధ్యతలను బీద రవీంద్ర చేతుల్లో పెట్టేస్తున్నారు.అన్నదమ్ములిద్దరికీ స్థాన బలం, అర్థ బలం పుష్కలంగా ఉన్నాయి.మరి వీరిద్దరిలో ఎవరు పై చేయి సాధిస్తారు అన్నది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube