అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో టీడీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు.వైసీపీ మంత్రి ఉషశ్రీ చరణ్ అక్రమంగా భూములు కొనుగోలు చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో భూములను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు వెళ్తున్న టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు.ఈ తరుణంలోనే మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి సహా పలువురు నాయకులను గృహా నిర్బంధం చేశారు.
అనంతరం ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడకుండా కల్యాణదుర్గంలో పోలీసులు భారీగా మోహరించారు.







