ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ జాతీయ అద్యక్ష్యులు నారా చంద్రబాబు( Chandrababu Naidu ) స్కిల్ డెవలప్మెంట్ కేసు లో అరెస్ట్ అయ్యి రాజముండ్రి సెంట్రల్ జైలు లో గత నెల రోజుల నుండి ఉంటున్న సంగతి అందరికీ తెలిసిందే.ఆయన ఎప్పుడు బయటకి వస్తాడో తెలియని పరిస్థితి.
ఒక్కసారి ఆయన బయటకు వచ్చిన తర్వాత తెలుగు దేశం పార్టీ క్యాడర్ లో ఉత్సాహం మామూలు రేంజ్ లో ఉండదనే చెప్పాలి.అధికార వైసీపీ కి వెన్నులో వణుకు పుట్టడం ఖాయం.
కానీ జగన్ చంద్రబాబు ని ఎన్నికలు అయ్యే వరకు బయటకి రప్పించకూడదు అనే ప్లాన్ లో ఉన్నాడని , రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతున్న చర్చ.బయటకి వస్తే పరిణామాలు ఎలా మారిపోతాయి అనేది జగన్( YS Jagan Mohan Reddy ) ఎప్పుడో పసిగట్టాడు.
ఇప్పుడు ఆయన బనాయించిన కేసుల నుండి చంద్రబాబు కి విముక్తి కలిగినా, మరో కీలకమైన కేసు లో ఆయనని ఇరికించడానికి సిద్ధం గా ఉన్నట్టు సమాచారం.
వాస్తవానికి చంద్రబాబు నాయుడిని జైలులోకి పంపితే టీడీపీ పార్టీ సమూలంగా నాశనం అయిపోతుందని వైసీపీ పార్టీ అనుకుంది.ఎన్టీఆర్ కాలం లో టీడీపీ పార్టీ రెండు వర్గాలుగా ఎలా అయితే చీలిపోయిందో, అలా చీలిపోయే ప్రమాదం ఉందని వైసీపీ నాయకులూ అప్పట్లో బహిరంగంగానే ప్రకటించారు.కానీ జైలు నుండి చంద్రబాబు నాయుడు నడిపిస్తున్న రాజకీయం వల్ల తెలుగు దేశం పార్టీ ఇంకా మనుగడ సాగిస్తుందని అంటున్నారు విశ్లేషకులు.
రెండు నెలల క్రితం తో పోలిస్తే తెలుగు దేశం పార్టీ గ్రాఫ్ కాస్త తగ్గింది అనే విషయం వాస్తవమే.కానీ జనసేన( Jana sena ) కలయిక కారణంగా తక్కువ మెజారిటీ తో అయినా టీడీపీ – జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్తుందని అంటున్నాయి లేటెస్ట్ సర్వేలు.
అయితే వైసీపీ పార్టీ కోరుకున్న విధంగా తెలుగు దేశం పార్టీ కుప్పకూలలేదు అంటే దానికి కారణం ‘ములాఖత్’ లు అని అంటున్నారు విశ్లేషకులు.
రోజుకి మూడు ములాఖత్ లు ఉండడం వల్ల తెలుగు దేశం పార్టీ కార్యక్రమాలు మొత్తం సజావుగా చంద్రబాబు ప్లాన్ ప్రకారం సాగిపోతున్నాయని.అందుకే ఇప్పుడు ‘ములాఖత్’ లకు బ్రేక్ వెయ్యాలని వైసీపీ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నట్టు చెప్తున్నారు తెలుగు దేశం పార్టీ నేతలు.ఇప్పుడు రోజుకి కేవలం ఒకే ఒక్క ములాఖత్ ఉంటుందట.
అది కూడా చాలా తక్కువ సమయం మాత్రమే ఉంటుందని అంటున్నారు.ఇలా ములాఖత్ లు సాధ్యమైనంత తక్కువ చేస్తే చంద్రబాబు ఐడియాస్ అంత తక్కువగా తెలుగు దేశం పార్టీ కి చేరుతుందని.
అప్పుడు చాలా సులువుగా టీడీపీ ని అనుకున్న విధంగా దెబ్బ తియ్యొచ్చు అని అనుకుంటున్నారు అట.