రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు శ్రీదేవి డ్రామా కంపెనీ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.శ్రీదేవి డ్రామా కంపెనీ షోలు జబర్దస్త్, సోషల్ మీడియా ద్వారా గుర్తింపు సంపాదించుకున్న వారు అందరూ కలిసి కామెడీ డాన్సులతో అదరగొడుతూ ప్రేక్షకులను ఫుల్ గా ఎంటర్టైన్ చేస్తున్నారు.
ఈ షో కి యాంకర్ గా రష్మీ వ్యవహరిస్తుండగా జడ్జ్ గా ఇంద్రజ వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.అప్పుడప్పుడు సెలబ్రిటీలను గెస్టులుగా కూడా ఇన్వైట్ చేస్తూ ఉంటారు.
ఇది ఇలా ఉంటే ఇటీవల జబర్దస్త్ షోకి కొత్త యాంకర్ సౌమ్యరావు ఎంట్రీ ఇచ్చిన తెలిసిందే.అతి తక్కువ సమయంలోనే వచ్చి రాని తెలివితో తెలుగులో బాగానే పాపులారిటీని సంపాదించుకుంది.
వచ్చి రావడంతోనే హైపర్ ఆదికి రివర్స్ లో పంచులు వేసి బాగా పాపులర్ అయింది.దాంతో హైపర్ ఆదికి తగ్గట్టుగానే ఉంది హైపర్ ఆదికి సౌమ్యరావే కరెక్ట్ అని చాలామంది నెటిజెన్స్ కామెంట్స్ కూడా చేశారు.ఇప్పటికే చాలా సార్లు సౌమ్యరావు హైపర్ ఆదికి రివర్స్ లో పంచులు వేస్తూ సెటైర్లు వేసిన విషయం తెలిసిందే.తాజాగా కూడా మరోసారి స్టేజ్ పైన హైపర్ ఆది పరువు తీసేసింది సౌమ్య రావు.
హోలీ పండుగ సందర్భంగా గుండెజారి గల్లంతయ్యిందే అనే కొత్త వెంటనే ప్లాన్ చేశారు ఈటీవీ వారు.అందుకు సంబంధించిన ప్రోమోని తాజాగా విడుదల చేశారు.కాగా హోలీ పండుగ ఈవెంట్ కి సీనియర్ నటి శ్రీదేవి గెస్ట్ గా హాజరయ్యింది.ఇక ఆ ప్రోమోలో డాన్సులు కామెడీ లతో సరదా సరదాగా సాగింది.
ఈ నేపథ్యంలోనే సౌమ్య రావు స్టేజ్ పై హైపర్ ఆదిని మరోసారి ఆడుకోవడం హైలైట్ గా నిలిచిందని చెప్పవచ్చు.ఇక హోలీ ప్రోగ్రాం సందర్భంగా హైపర్ ఆది నువ్వు స్కూటీలో సౌమ్యరావుని ఎక్కించుకొని అలా ఒక రౌండ్ వెయ్యాలి అనడంతో సరే అని అంటాడు.అప్పుడు హైపర్ ఆది ఆ స్కూటీని హ్యాండిల్ చేయలేకపోవడంతో వెంటనే స్కూటీ దిగిన సౌమ్య రావు ఆదితో నీకు యాక్టింగ్ రాదు, కామెడీ కూడా రాదు, ఇప్పుడు బైక్ నడపడం కూడా రాదా అని కౌంటర్ వేయడంతో హైపర్ ఆది తలదించుకున్నాడు.అలా మరోసారి హైపర్ ఆదికి గట్టిగా బుద్ధి చెప్పింది సౌమ్య రావు.
ఇక ఇందుకు సంబంధించిన ప్రోమోని చూసిన నెటిజన్స్హైపర్ ఆదికి కరెక్టు పర్సన్ ని దింపారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.