రెగ్యులర్ గా మీరు తినే ఈ ఆహారాలు గుండెకు ముప్పును పెంచుతాయని మీకు తెలుసా?

ఇటీవల రోజుల్లో గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య అంతకంతకు పెరిగిపోతోంది.అలాగే ప్రతి ఏడాది గుండె వ్యాధులతో మరణిస్తున్న వారు కూడా భారీగా పెరుగుతున్నారు.

 These Foods That You Eat Regularly Increase The Risk Of Heart Disease! Heart Dis-TeluguStop.com

గుండె జబ్బుల బారిన పడటానికి ఎన్నో కారణాలు ఉన్నాయి.అయితే ఆహారపు అలవాట్లు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

ముఖ్యంగా మీరు రెగ్యులర్ గా తినే కొన్ని కొన్ని ఆహారాలు గుండెకు ముప్పును అధికంగా పెంచుతాయి.

ఈ లిస్టులో వైట్ పాలిష్డ్ రైస్ ముందు వరుసలో ఉంది.

రోజుకు రెండు పూట‌లు వైట్ రైస్ తినే అవ‌వాటు చాలా మందికి ఉంది.కానీ, పాలిష్ చేసిన తెల్లటి బియ్యాన్ని తినడం వల్ల రక్తంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ హెవీగా పెరిగిపోతుంది.

బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగింది అంటే గుండె పోటు తో సహా వివిధ రకాల గుండె జబ్బులు వచ్చే రిస్క్ పెరుగుతుంది.

Telugu Bad Foods, Tips, Healthy Heart, Heart, Heart Diseases, Latest-Telugu Heal

తెల్లటి బియ్యం మాత్రమే కాదు పంచదార, మైదా, తెల్లటి రవ్వ, సాల్ట్ వంటివి కూడా గుండెకు ముప్పు పెంచుతాయి.అలాగే బర్గర్, పిజ్జా వంటి జంక్ ఫుడ్స్, నూనెలో వేయించిన ఆహారాలు, ఐసో క్రీమ్స్‌, కూల్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్, ప్రాసెస్ చేసిన మాంసం వంటివి కూడా గుండె ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు.అందుకే ఆరోగ్య నిపుణులు ఇటువంటి ఆహారాలకు దూరంగా ఉండమని చెబుతున్నారు.

Telugu Bad Foods, Tips, Healthy Heart, Heart, Heart Diseases, Latest-Telugu Heal

వీటికి బదులుగా ఆకుకూరలు, ఓట్స్, సీజనల్ ఫ్రూట్స్, బాదం, పిస్తా, వాల్ నట్స్, గుమ్మడి గింజలు, పుచ్చ గింజలు, పొద్దు తిరుగుడు విత్తనాలు, చేప‌లు, బీన్స్, పప్పు ధాన్యాలు, మొల‌కెత్తిన విత్తనాలు, బ్రౌన్ రైస్, బెల్లం, జొన్న‌లు, రాగులు వంటి ఆహారాలను డైట్ లో చేర్చుకోవాలి.ఇవి రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ను కరిగించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతాయి.దీంతో వివిధ రకాల గుండె సంబంధిత వ్యాధులు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.మీ గుండె పది కాలాల పాటు పదిలంగా ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube