ఝాన్సీ.( Jhansi ) యాంకర్ గా కాకుండా విభిన్నమైన పాత్రలో నటించగలిగె సత్తా ఉన్న నటి.కోకాపేట్ ఆంటీ గా ఆమె చేసిన సందడి అంతా ఇంతా కాదు చాలామంది నటీమణులకు లేని ప్రత్యేకమైన యాస ఆమె సొంతం.అయితే ఆమె కెరియర్ మొదలుపెట్టింది మాత్రం యాంకరింగ్ లోనే.
దాదాపు రెండు దశ్శాబ్దాల క్రితం ఆమె బుల్లితెరపై అనేక షోలతో సందడి చేసేది.కానీ కాలం మారిపోయింది ఆమెకు యాంకరింగ్( Anchor ) అవకాశాలు తగ్గిపోయాయి.
బుల్లి తెరకు కూడా గ్లామర్ యాడ్ అవుతుండడంతో సాంప్రదాయానికి మారుపేరుగా ఉన్న ఝాన్సీ లాంటి చాలా మంది యాంకర్స్ కి కాలం చెల్లిపోయింది.అయితే కొన్నాళ్లపాటు కొన్ని ముఖ్యమైన మరియు విలువలతో కూడిన చానల్స్ లో ప్రత్యేకమైన షోలతో ఆమె సందడి చేసిన ఆ తర్వాత రోజుల్లో అవి కూడా కనిపించడం లేదు.
ఇక ఇప్పటి తరం వారికి ఝాన్సీ యాంకర్ అనే విషయం కూడా గుర్తుందో లేదో అనుమానమే.
అయితే ఆమెకు నటిగా మంచి భవిష్యత్తు ఉందని చాలా రోజుల క్రితమే ఇండస్ట్రీ గుర్తించింది.అందుకే ఆమెకు అప్పుడప్పుడు కొన్ని అవకాశాలు ఇస్తూ ప్రోత్సహించారు దర్శకులు.పూర్తిగా కాకుండా భిన్నమైన పాత్రలు ఇస్తూ ఆమెను ఎంకరేజ్ చేస్తూ వచ్చారు.
గతంలో హీరో నానికి అష్టా చమ్మా సినిమాలో అత్తగా కూడా నటించింది.ఇక ఇన్నేళ్ల తర్వాత కూడా ఇప్పుడు దసరా సినిమాలో( Dasara movie ) నానికి మరోమారు నానికి అత్త పాత్రలో నటిస్తుంది.
పూర్తిగా తెలంగాణ యాసతో, గోదావరిఖని స్లాంగ్ లో దసరా సినిమా వస్తుందని విషయం మనందరికీ తెలిసిందే.తులసి సినిమాలో వెంకటేష్ తో కోకాపేట్ ఆంటీగా కామెడీ పండించిన ఝాన్సీ ఇప్పుడు నానికి అత్తగా కాస్త సీరియస్ రోల్ లో నటిస్తోంది.
మొన్నటికి మొన్న ఐశ్వర్య రాజేష్ క్రికెట్ నేపద్యంలో సినిమా తీస్తే అందులో ఆమెకు తల్లి పాత్రలో నటించింది.ఇలా ముఖ్యమైన క్యారెక్టర్ ఉంటే ఆమె ఎలాంటి రోల్ లో అయినా నటించడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది.కానీ ఎందుకో ఇంకా ఝాన్సీ ని పూర్తిగా స్థాయిలో ఇండస్ట్రీ వాడుకోవడం లేదని అనిపిస్తూ ఉంటుంది.ఆమెలో మంచి నటి ఉంది అందుకు తగ్గ పాత్రలు రాస్తూ ఝాన్సీ లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే వేరే రాష్ట్రాల నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టులను తెప్పించుకునే బాధ కూడా ఉండదు.
అందుకే ఝాన్సీ లాంటి మధ్య వయస్సు నటీమణులు ఇండస్ట్రీకి చాలా అవసరం.