చీకటిపై వెలుగు సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే దీపావళి పర్వదినాన్ని( Diwali Festival ) ఆదివారం భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు.భారతీయులు పెద్ద సంఖ్యలో స్థిరపడిన కెనడాలోనూ( Canada ) దీవాళి వేడుకలు అట్టహాసంగా జరిగాయి.
ఇకపోతే.ప్రస్తుతం కెనడా – భారత్ మధ్య ఉద్రిక్తతలకు కారణమైన ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో( Justin Trudeau ) సైతం ప్రపంచవ్యాప్తంగా వున్న హిందువులు, సిక్కులకు దీపావళి, బందీ చోర్ దివాస్ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్)లో రెండు వేర్వేరు పోస్టులు పెట్టారు.బ్రాంప్టన్, టొరంటో, ఒట్టావా, ఎటోబికోక్‌లలో జరిగిన దీపావళి, బండి చోర్ దివాస్‌లలో పాల్గోన్న ఫోటోలను ట్రూడో పంచుకున్నారు.

కాగా.ఖలిస్తాన్ వేర్పాటువాద నేత, ఖలిస్తాన్ టైగర్స్ ఫోర్స్ అధినేత హర్‌దీప్ సింగ్ నిజ్జర్( Hardeep Singh Nijjar ) హత్య వెనుక భారత ప్రమేయం వుండొచ్చంటూ జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా మంటలు రేపుతున్న సంగతి తెలిసిందే.నిజ్జర్ హత్య వెనుక ఇండియా వుందంటూ కెనడాలోని సిక్కు సంస్థలు గత కొంతకాలంగా వాదిస్తున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ట్రూడో వ్యాఖ్యలు వారికి మరింత బలాన్ని ఇచ్చినట్లయ్యింది.
ఈ పరిణామాల నేపథ్యంలో కెనడాలో ఎప్పుడు ఏం జరుగుతోందోనని ఆందోళన వ్యక్తమవుతోంది.భయపడినట్లుగానే సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్‌జే)( Sikhs For Justice ) తీవ్రంగా స్పందిస్తోంది.
హిందువులంతా తక్షణం కెనడాను వదిలిపెట్టాల్సిందిగా ఎస్ఎఫ్‌జే హెచ్చరించింది.నిజ్జర్ హత్యకు గాను భారతదేశానికి ( India ) మద్ధతుగా హింసను ప్రోత్సహించినందుకు కెనడాను విడిచిపెట్టాల్సిందిగా అల్టీమేటం జారీ చేసింది.

తాజాగా ఖలిస్తాన్ అనుకూల వాదులు( Khalistan ) కెనడాలో దీపావళి వేడుకలను టార్గెట్ చేయడం కలకలం రేపింది.బ్రాంప్టన్‌లో( Brampton ) దీవాళి వేడుకల్లో పాల్గొంటున్న వారిపై వారు రాళ్లు రువ్వారు.దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.పోలీసులు వీడియోలను తీస్తున్న వారిని, రాళ్లు విసురుతున్న వారిని ఆపడానికి ప్రయత్నిస్తున్నారు.దీనిపై నెటిజన్లు భగ్గుమంటున్నారు.దీపావళి వేడుకలు జరుపుకుంటున్న హిందువులపై దాడి గురించి వినడం చాలా దురదృష్టకరమమన్నారు.
కెనడియన్ మీడియా ఈ సంఘటనను సిక్కులు హిందువుల మధ్య పోరాటంగా పేర్కొనడం ఆందోళన కలిగిస్తుంది.ఈ దాడి స్పష్టంగా మతపరమైన ద్వేషంతోనే జరిగిందని నెటిజన్లు మండిపడుతున్నారు.