పాకిస్తాన్ కి సహాయం చేస్తున్న అమెరికా

పాకిస్థాన్ కు 8 ఎఫ్-16 యుద్ధ విమానాలను విక్రయించాలని నిర్ణయించుకున్న అమెరికా, విమానాల కొనుగోలుకు అవసరమయ్యే నిధులను కూడా రుణం రూపంలో ఇస్తామని వెల్లడించింది.లాక్ హీడ్ మార్టిన్ కార్పొరేషన్ తయారు చేసిన ఈ జెట్ యుద్ధ విమానాలను, రాడార్లు, ఇతర పరికరాలను పాక్ కు అమ్మేందుకు 699 మిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాన్ని అమెరికా కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.

 Ameriica Helping Pakistha-TeluguStop.com

ఇప్పుడీ డీల్ ను పూర్తి చేసేందుకు పాక్ వద్ద చాలినన్ని నిధులు లేకపోవడంతో ఒబామా సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది.ప్రభుత్వం తరఫున పాక్ కు రుణమిచ్చి డీల్ కు సహకరించాలని నిర్ణయించింది.

పలువురు కాంగ్రెస్ సభ్యులు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు.

పాక్ కు విమానాలు అందిస్తే, అవి ప్రపంచానికి ముప్పుగా మారుతున్న ఉగ్రవాదుల చేతికి చిక్కే ప్రమాదముందని పలువురు వ్యాఖ్యానించారు.

అయితే, మిలిటెంట్లకు వ్యతిరేకంగా తాము చేసే పనులను పాక్ ప్రభుత్వం ప్రపంచానికి చూపాలని రిపబ్లికన్ సెనెటర్ బాబ్ కార్కర్ వ్యాఖ్యానించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube