అమరావతి: వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ.శాసన సభ ఒక్కరోజే నిర్వహించాలని అనుకున్నా ప్రతిపక్ష పార్టీ అభ్యర్థన మేరకు 26 తేదీ వరకు పొడిగించారు.
ఇవాళ సభలో చంద్రబాబు మళ్ళీ సీఎం గానే శాసన సభకు వస్తానని శపథం చేసి వెళ్లిపోయారు.సభ నుంచి బయటకు వెళ్ళిపోయి ఏదేదో మాట్లాడారు.
సభలో తన భార్య గురించి మాట్లాడారని మీడియా ముందు విలపించారు.సభలో ఆయన కుటుంబ సభ్యుల గురించి ఎవరూ ఏం మాట్లాడలేదు.
సీఎం జగన్ ను బోషడికే అని తిట్టించినా ఆయన ప్రజలకే చెప్పుకున్నారు.
కుప్పంలో గెలవలేక పోవడం వల్లే ఈ తరహా ఆరోపణలు చేస్తున్నారు.
చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరి గారిని మేమె మీ అనలేదని బహిరంగంగా విజ్ఞప్తి చేస్తున్నాం.ఆవిడ పేరును వాడుకుని చంద్రబాబు రాజకీయ లబ్ది కోసమే ఈ ప్రయత్నాలు చేస్తున్నారు.
భువనేశ్వరిని సభలో ఏమి అనలేదని మరోమారు స్పష్టం చేస్తున్నాం.పార్టీని విడిచిపెట్టి వెళ్లాల్సిన పరిస్థితులు చంద్రబాబు కు వచ్చేసాయి.
కుటుంబ సభ్యులను మోసం చేసిన చంద్రబాబు కు ప్రజలే బుద్ధి చెప్పారు.మీడియా సమావేశంలో ఆయన విలపించటం డ్రామా మాత్రమే.వైసీపీ పై బురద చల్లి విలపిస్తూ సానుభూతి పొందాలని చూస్తున్నారు.భువనేశ్వరి గారిని ఒక్క మాట కుడా అనలేదని మరొక్కమారు విజ్ఞప్తి చేస్తున్నాం.
చర్చ సందర్భంగా వచ్చిన మాటలు విని ఏదోదో ఊహిస్తే ఎలా.