అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం జనసేన పార్టీలో మరోసారి వర్గ విభేదాలు బహిర్గతం అయ్యాయి.పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో వివాదం బయటపడింది.
ఒక వర్గం వారికే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపిస్తూ మరో వర్గం డీఎంఆర్ శేఖర్ వర్గీయులు తిరగబడ్డారు.ఈ క్రమంలో నియోజకవర్గం ఇంఛార్జ్ రాజబాబు, డీఎంఆర్ శేఖర్ వర్గీయుల మధ్య తోపులాట చోటు చేసుకుంది.
కాగా పార్టీ అధినేత పవన్ నిర్వహిస్తున్న వారాహి యాత్ర అమలాపురానికి రానుండగా వర్గ విభేదాలు చోటు చేసుకున్నాయి.