వారంలో ఈ నాలుగు గంటలు మాత్రమే సంతోషం ఉంటుంది... విడాకులపై క్లారిటీ ఇచ్చిన కళ్యాణ్ దేవ్!

మెగా డాటర్ శ్రీజ ( Sreeja ) తన భర్త కళ్యాణ్ దేవ్ ( Kalyan Dev ) నుంచి దూరంగా ఉంటున్న సంగతి మనకు తెలిసిందే.వీరిద్దరూ విడాకులు (Divorce) తీసుకొని విడిపోయారు.

 Happiness Is Only These Four Hours In A Week ,kalyan Dev, Sreeja, Navishka, Soci-TeluguStop.com

అయినప్పటికీ ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటించలేదు.ఈ విధంగా విడాకులు తీసుకుని విడిపోయిన అనంతరం కళ్యాణ్ దేవ్ ఒంటరిగా ఉండగా శ్రీజ మాత్రం తన పిల్లలతో కలిసి ఉంటున్నారు.

ఇక శ్రీజ కళ్యాణ్ దేవ్ దంపతులకు నవిష్క( Navishka ) జన్మించిన సంగతి మనకు తెలిసిందే.ఈ విధంగా కళ్యాణ్ దేవ్ తన భార్యకు విడాకులు ఇవ్వడంతో తన కుమార్తెకు కూడా దూరం కావాల్సి వచ్చింది.

ఈ క్రమంలోనే కళ్యాణ్ దేవ్ తన కుమార్తెను చాలా మిస్ అవుతున్నాను అంటూ తరచూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తూ ఉంటారు.అయితే తాజాగా ఈయన తన తన కుమార్తెతో కలిసి ఉన్న ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.అయితే ఈ పోస్ట్ కనుక చూస్తే వీళ్లిద్దరూ విడాకులు తీసుకున్నారని పక్కా క్లారిటీ వచ్చేసింది.ఈ సందర్భంగా కళ్యాణ్ దేవ్ తన కుమార్తె ఫోటోని షేర్ చేస్తూ వారంలో నేను సంతోషంగా గడిపే క్షణాలు ఈ నాలుగు గంటలు మాత్రమే అంటూ పోస్ట్ చేశారు.

సాధారణంగా భార్యాభర్తలు విడాకులు తీసుకున్న తర్వాత కోర్టు ( Court) వారికి కొన్ని నిబంధనలను విధిస్తుంది.విడాకులు తీసుకోబోయే జంట వాదోపవాదనలు విన్న తర్వాత వారి పిల్లలు ఎవరి దగ్గర ఉండాలి తండ్రి వద్ద ఎంత సమయం ఉండాలి అన్న నిబంధనలను విధిస్తుంది.ఈ క్రమంలోనే కోర్టు కళ్యాణ్ దేవ్ కి కూడా అలాంటి నిబంధనలు విధించిందని తెలుస్తోంది.కేవలం వారంలో నాలుగు గంటలు ( Four Hours ) మాత్రమే తన కూతురితో కలిసి ఉండటానికి పర్మిషన్ ఇచ్చిందని తెలుస్తుంది.

అందుకే ఈయన వారంలో ఈ నాలుగు గంటల ఆనంద క్షణాలు అంటూ పోస్ట్ చేశారని అర్థమవుతుంది.ఇలా కళ్యాణ్ దేవ్ ఈ విధమైనటువంటి పోస్ట్ చేయడంతో కచ్చితంగా వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారు కానీ ఈ విషయాన్ని ప్రకటించలేదని అందరికీ అర్థమవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube