అల్లరి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరో నరేష్ మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ కావడంతో తన పేరు ముందు అల్లరి చేర్చుకొని అల్లరి నరేష్ (Allari Naresh)గా మారిపోయారు.ఇలా అల్లరి నరేష్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ఈయన కెరియర్ మొదట్లో కామెడీ సినిమాల ద్వారా పెద్ద ఎత్తున ప్రేక్షకులను నవ్వించారు.
అయితే తనలో కేవలం కామెడీ మాత్రమే కాదని మరో యాంగిల్ కూడా ఉందంటూ నరేష్ ఈమధ్య కాలంలో నటిస్తున్న సినిమాలను చూస్తే అర్థమవుతుంది.నాంది, ఇట్లు మారేడు మల్లి ప్రజానీకం వంటి సినిమాలతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి నరేష్ తాజాగా ఉగ్రం(Ugram) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఈ సినిమా మే ఐదవ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో అల్లరి నరేష్ కుమార్తె (Naresh Daughter) ఊహ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.ఇక ఈ సినిమాలో అల్లరి నరేష్ కుమార్తె కూడా నటించడం విశేషం.
ఇక వేదికపై ఊహ మాట్లాడుతూ ఈ సినిమాలో తాను కూడా నటించాలని సినిమా చాలా అద్భుతంగా ఉంది ప్రతి ఒక్కరు చూడాలని కోరారు.
రెండవ తరగతి పూర్తి చేసుకున్న ఈ చిన్నారి వేదికపై ఎంతో ముద్దు ముద్దుగా మాట్లాడుతూ అందరిని ఆకట్టుకుంది.ఇక పెద్దయ్యాక ఏమవుతావని ప్రశ్నించగా తాను పెద్ద అయిన తర్వాత సమంత అవుతానంటూ షాకింగ్ సమాధానం చెప్పారు.ఇక పెద్దయిన తర్వాత సమంత స్థాయిలో స్టార్ హీరోయిన్ కావాలని ఇప్పుడే ఈ చిన్నారి ఫిక్స్ అయిందని తెలుస్తోంది.
ఇలా పెద్దయిన తర్వాత తాను కూడా హీరోయిన్ అవుతాను అంటూ ఈ చిన్నారి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.వరుస హిట్ సినిమాలలో నటిస్తున్నటువంటి నరేష్ ఉగ్రం సినిమా ద్వారా ఎలా ప్రేక్షకులను సందడి చేయబోతున్నారో తెలియాల్సి ఉంది.