ఐపీఎల్ వేలంలో అందరి దృష్టి వీరిపైనే.. కాసుల వర్షం కురిపించనున్న ఫ్రాంచైజీలు

క్రికెట్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఐపీఎల్-2023 త్వరలోనే జరగనుంది.దీనికి సంబంధించిన ఆటగాళ్ల మినీ వేలాన్ని డిసెంబర్ 23న కొచ్చిలో నిర్వహించనున్నారు.

 All Eyes Are On These Players In Ipl 2023 Auction Sam Curran Cameron Green Ben S-TeluguStop.com

ఈ వేలం కోసం 405 ఆటగాళ్లతో కూడిన తుది జాబితాను ఐపీఎల్ యాజమాన్యం ప్రకటించింది.అందులో భారత్‌కు చెందిన వారు 273 మంది ఉండగా, 132 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు.

ప్రతి జట్టు 25 మంది క్రికెటర్లను గరిష్టంగా కొనుగోలు చేయొచ్చు.అంటే ప్రస్తుతం 87 మంది క్రికెటర్ల వరకు జట్టులు కొనుగోలు చేసే అవకాశం ఉంది.

ప్రస్తుతం జరగనున్న ప్లేయర్ వేలంలో బెన్ స్టోక్స్, కామెరాన్ గ్రీన్, సామ్ కుర్రాన్ వంటి టాప్ ప్లేయర్లు ఉన్నారు.వీరితో పాటు కొందరు అనామక క్రికెటర్లపై కూడా కాసుల వర్షం కురవనుంది.

భారతీయ దేశీయ క్రికెట్‌లో విధ్వత్ కవెర్రాపా ఓ సంచలనం.బాల్‌తోనే కాకుండా బ్యాట్‌తోనూ అతడు రాణించగలడు.సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2022 సీజన్‌లో ఈ 23 ఏళ్ల ఆటగాడు బౌలర్‌గా రాణించాడు.8 మ్యాచ్‌లలో 6.36 ఎకానమీతో 18 వికెట్లు పడగొట్టాడు.ఇటీవల ముగిసిన విజయ్ హజారే ట్రోఫీలోనూ రాణించాడు.8 మ్యాచ్‌లలో 3.63 ఎకానమీతో 17 వికెట్లు తీశాడు.తర్వాత వాసుకి కౌశిక్ కూడా దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడు.30 ఏళ్ల ఈ క్రికెటర్ 20 లిస్ట్-ఎ మ్యాచ్‌లలో ఆడాడు.3.42 ఎకానమీతో 37 వికెట్లు తీశాడు.

Telugu Ben, Cameron Green, Gerald Goetzee, Ipl, Sam Curran, Teams, Latest-Latest

పొట్టి ఫార్మాట్ విషయానికి వస్తే, అతను 33 మ్యాచ్‌లలో 7.59 ఎకానమీతో 40 వికెట్లు సాధించాడు.వీరితో పాటు దక్షిణాఫ్రికాకు చెందిన గెరాల్డ్ కోయెట్జీ‌పైన కూడా ఫ్రాంఛైజీలు దృష్టిసారించాయి.29 మ్యాచ్‌లలో 7.76 ఎకానమీతో 37 వికెట్లు తీశాడు.ఇటీవల ఓ మ్యాచ్‌లో ఆఖర్లో బ్యాటింగ్‌కు వచ్చి 207.31 స్ట్రైక్ రేట్‌తో 85 పరుగులు చేశాడు.ఇంగ్లాండ్ దేశవాళీ క్రికెట్‌లో ల్యూక్ వుడ్ సంచలనాలు నమోదు చేస్తున్నాడు.

Telugu Ben, Cameron Green, Gerald Goetzee, Ipl, Sam Curran, Teams, Latest-Latest

60 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో 35.18 సగటుతో 132 వికెట్లు పడగొట్టాడు.టీ20 ఫార్మాట్‌లో 84 మ్యాచ్‌లు ఆడి 8.34 ఎకానమీతో 77 వికెట్లు పడగొట్టాడు.నెదర్లాండ్‌కు చెందిన పాల్ వాన్ మీకెరన్ టీ20 క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడు.చివరి ఓవర్లలో పొదుపుగా బౌలింగ్ చేసే సామర్థ్యం అతడికి ఉంది.అతను 58 టీ20ల్లో 6.99 ఎకానమీతో 64 వికెట్లు తీశాడు.మ్యాచ్ ఫలితం మార్చగలిగిన సత్తా ఉన్న ఈ ఐదుగురిని దక్కించుకునేందుకు ఫ్రాంచైజీలు దృష్టిసారించాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube