సరి లేరు నీకెవ్వరు : మళ్ళీ భారీ విరాళం ప్రకటించిన అక్షయ్.... 

బాలీవుడ్ సినీ పరిశ్రమలో ఎటువంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా హీరోగా ఎదిగిన స్టార్ హీరో అక్షయ్ కుమార్ గురించి తెలియని వారుండరు.ఎప్పుడు విభిన్న కథనాలను ఎంచుకోవడం, కొత్త కొత్త ప్రయోగాలు చేయడం వంటి వాటిలో అక్షయ్ కుమార్ ముందుంటాడు.

 Akshay Kumar, Laxmi Bomb, Coronavirus, Pm Cares Fund, Covid-19,mumbai Police De-TeluguStop.com

ఇటీవల కాలంలో అక్షయ్ కుమార్ కరోనా వైరస్ మహమ్మారిని అరికట్టడం కోసం దాదాపుగా 25 కోట్ల రూపాయలు విరాళంగా ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే.

అంతేకాక ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా సేవలందిస్తున్నటువంటి మున్సిపల్ కార్మికులకు తన వంతు సాయంగా 3 కోట్ల రూపాయలు ప్రకటించాడు.

తన సినిమాల పరంగానే కాకుండా అక్షయ్ కుమార్ రియల్ హీరో అంటూ తన అభిమానులు ఆకాశానికి ఎత్తేస్తున్నారు.తాజాగా అక్షయ్ కుమార్ ముంబై పోలీస్ డిపార్ట్ మెంట్ కి 2 కోట్ల రూపాయలు విరాళంగా ఇస్తున్నట్లు తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపాడు.

దీంతో అక్షయ్ కుమార్ చేసినటువంటి ఈ పనికి నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.కరోనా వైరస్ మహమ్మారి కట్టడి చేయడానికి అక్షయ్ కుమార్ తన వంతు సాయంగా ఇప్పటివరకు దాదాపుగా 30 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చాడు.

దీంతో పలువురు నెటిజన్లలో ఇంత భారీ విరాళాన్ని ఇవ్వడానికి గల కారణాలేంటని అక్షయ్ కుమార్ ని ప్రశ్నించగా గతంలో తాను ఏమీ లేకుండా సినీ పరిశ్రమకి వచ్చానని ఆ తరువాత తన అభిమానులు, ప్రజల వల్లే ఇంతటి వాడిగా ఎదిగానని, ఇలాంటి సమయంలో ప్రజలకు అండగా నిలబడాలని అనుకుంటున్నట్లు గతంలో అక్షయ్ కుమార్ చెప్పుకొచ్చాడు.

అయితే ఇటీవల కాలంలో అక్షయ్ కుమార్ నటించినటువంటి “లక్ష్మీ బాంబ్” అనే చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.

ఈ చిత్రానికి ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించాడు.అలాగే అక్షయ్ కుమార్  నటించిన సూర్యవంశి అనే చిత్రం కూడా విడుదలకు సిద్ధంగా ఉంది.

 

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube