అక్కినేని అఖిల్ హీరోగా నటించిన మూడవ సినిమా ‘మిస్టర్ మజ్ను’ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.భారీ అంచనాల నడుమ రూపొందిన మిస్టర్ మజ్ను చిత్రం మంచి విజయాన్ని దక్కించుకుని అఖిల్‌కు స్టార్డం తెచ్చి పెడుతుందని అంతా భావించారు.
కాని అనూహ్యంగా మిస్టర్ మజ్ను చిత్రం ఆకట్టుకోలేక పోయింది.మిశ్రమ స్పందన వచ్చింది.
అయితే అఖిల్ గత చిత్రాలు ‘అఖిల్’ మరియు ‘హలో’ చిత్రాలు తీవ్రంగా నిరాశ పర్చాయి.అయినా కూడా మంచి ఓపెనింగ్స్‌ను అయితే దక్కించుకున్నాయి.
కాని ఇప్పుడు మిస్టర్ మజ్ను చిత్రం మాత్రం మినిమం కలెక్షన్స్‌ను రాబట్టడంలో విఫలం అయ్యింది.

‘మిస్టర్ మజ్ను’ చిత్రం మొదటి మూడు రోజుల్లో కేవలం 9 కోట్లను మాత్రమే రాబట్టింది.అఖిల్ గత చిత్రాలు మొదటి మూడు రోజుల్లో 15 కోట్లకు పైగా వసూళ్లు చేశాయి.ఈసారి అఖిల్ మూవీకి కలెక్షన్స్ తగ్గడానికి ప్రధాన కారణం ఎఫ్ 2 అంటూ ప్రచారం జరుగుతుంది.
మొన్నటి వీకెండ్లో కూడా ఎఫ్ 2 చిత్రం హౌస్ ఫుల్ కలెక్షన్స్‌తో నడిచింది.దాంతో మిస్టర్ మజ్ను చిత్రంకు ఎఫెక్ట్ పడ్డట్లయ్యింది.ఎఫ్2 చిత్రం జోరు సాగుతున్న సమయంలో రావడం వల్ల మిస్టర్ మజ్ను చిత్రం పెద్దగా ఆకట్టుకోలేక పోయిందనే టాక్ వస్తుంది.

మిస్టర్ మజ్ను యూత్ ఆడియన్స్‌ను అలరించేలా ఉంది.కాని ఎఫ్ 2 చిత్రం ముందు మాత్రం నిలువలేక పోతుంది.ఒక మోస్తరు సినిమాలకు బాక్సాఫీస్ వద్ద పెద్దగా పోటీ లేకుంటే మంచి వసూళ్లు నమోదు అవుతాయి.
కాని ఈసారి మాత్రం అఖిల్ సినిమాకు ఎఫ్ 2 చిత్రం పోటీ ఇచ్చిన కారణంగా కలెక్షన్స్ ఆశించిన స్థాయిలో రాలేదు.అఖిల్ ఈ సినిమాతో అయినా స్టార్డంను దక్కించుకుంటానని ఆశించాడు.
కాని మరోసారి ఫెయిల్ అయ్యి, నిరాశతో ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.అఖిల్ నాల్గవ సినిమా ఏంటి అనేది చూడాలి.