ఒకప్పుడు రవితేజ మూవీస్ అంటే మినిమం సక్సెస్ అనుకునే వారు.ఆయన సినిమా కనీసం యావరేజ్‌గా అయినా ఉంటుంది, మంచి వసూళ్లు నమోదు అయ్యేవి.
కాని కాలక్రమేనా రవితేజ పరమ రొటీన్ సినిమాలు చేస్తూ తనకు తాను క్రేజ్ తగ్గించుకున్నాడు.ఏమాత్రం ఆకట్టుకునే కథలను తీసుకోకుండా దర్శకుడు ఏది చెబితే అదే అన్నట్లుగా సినిమాలు చేసిన రవితేజ ఇప్పుడు బాధపడుతున్నాడు.
ఇటీవల వచ్చిన మూడు నాలుగు సినిమాలు కూడా రవితేజ కెరీర్‌లో మాయని మచ్చగా నిలిచాయి.

ప్రస్తుతం విఐ ఆనంద్ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేసేందుకు ఈ సీనియర్ హీరో సిద్దం అయ్యాడు.తాజాగా సినిమాకు సంబంధించిన టైటిల్‌ను ప్రకటించారు.డిస్కో రాజా అనే టైటిల్‌తో రాబోతున్న రవితేజ కొత్త సినిమాలో చాలా విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నాడట.
అందుకు సంబంధించిన ఒక పుకారు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రం గురించి ఆ వార్త రావడంతో కొందరు అప్పుడే సినిమాపై పెదవి విరుస్తున్నారు.

సినిమాపై భారీ అంచనాలున్న ఇలాంటి సమయంలో ఎందుకు రవితేజ ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నాడంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.డిస్కో రాజా చిత్రంలో ముసలి వ్యక్తిగా రవితేజ కనిపించబోతున్నాడట.ముసలి వాడైన రవితేజ తనకు అన్యాయం చేసిన వారిపై పగ సాదించేందుకు యుక్త వయసు వాడిగా మారిపోతాడు.యుక్త వయసు ఉన్న వ్యక్తిగా రవితేజ ఎలా మారిపోయాడు అనేది సస్పెన్స్.
విఐ ఆనంద్ సినిమాలన్నీ కూడా చాలా విభిన్నంగా ఉంటాయి.అయితే ఇప్పటి వరకు ఆయన కమర్షియల్‌గా సక్సెస్‌లను దక్కించుకోలేక పోయాడు.
మరి ఈ చిత్రంతో అయినా కమర్షియల్ హిట్‌ను అందుకుంటాడేమో చూడాలి.