హీరో కూతురుకు కరోనా పాజిటివ్‌

సినీ ప్రముఖులు వరుసగా కరోనా బారిన పడుతున్నారు.కొందరు కరోనా బారిన పడ్డా కూడా బయటకు చెప్పడం లేదు.

 Arjun Daughter Infected Corona, Coronavirus, Aishwarya Arjun, Movie Shootings-TeluguStop.com

కొందరు మాత్రం సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించి ఇతరులను జాగ్రత్తగా ఉండమంటున్నారు.తనను కలిసిన వారు ఖచ్చితంగా పరీక్షలు చేయించుకోండి అంటూ సహాలు సూచనలు ఇస్తున్నారు.

అమితాబచ్చన్‌ తో పాటు ఇతర ఫ్యామిలీ మెంబర్స్‌ కు కూడా కరోనా బారిన పడ్డారు.ప్రస్తుతం ఈ విషయం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.
ఇప్పుడు సౌత్‌ స్టార్‌ హీరో అర్జున్‌ కూతురు ఐశ్వర్య అర్జున్‌ కూడా కరోనా బారిన పడ్డట్లుగా ప్రకటించింది.తాను కరోనా పాజిటివ్‌ అంటూ నిర్థారణ అయ్యింది.ప్రస్తుతానికి నేను బాగానే ఉన్నాను.నాతో కాంటాక్ట్‌లో ఉన్న వారు ఖచ్చితంగా పరీక్షలు చేయించుకోండి అంటూ విజ్ఞప్తి చేసింది.

ప్రతి ఒక్కరు కూడా కరోనా పట్ల అవగాహణ ఉండి ఏమాత్రం అనుమానం అనిపించినా కూడా పరీక్షలు చేయించుకోవాలంటూ సూచించింది.

Telugu Aishwarya Arjun, Arjun Corona, Coronavirus-

కరోనా నేపథ్యంలో సినీ ప్రముఖులు షూటింగ్స్‌ అన్ని బంద్‌ చేశారు.అయినా కూడా పార్టీలు పబ్‌ లు క్లబ్‌లు మీటింగ్స్‌ అంటూ తిరుగుతుండటం వల్లే వారికి ఈ పరిస్థితి ఎదురవుతుంది అంటూ నెటిజన్స్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.హీరోయిన్‌గా పలు చిత్రాల్లో నటించిన ఐశ్వర్య అర్జున్‌ తెలుగులో కూడా నటించేందుకు ఆసక్తిగా ఉంది.

కాని ఈలోపే కరోనా మహమ్మారి కారణంగా మొత్తం సీన్‌ రివర్స్‌ అయ్యింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube