ఆత్మహత్య చేసుకున్న హీరో పై సినిమా, ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌

సుశాంత్‌ ఆత్మహత్య చేసుకున్న తర్వాత చాలా మంది నెపొటిజం వల్లే అతడు మృతి చెందాడు అంటూ విమర్శలు చేయడం మొదలు పెట్టారు.కరణ్‌ జోహార్‌ నుండి సల్మాన్‌ ఖాన్‌ వరకు ఎంతో మందిని నెటిజన్స్‌ టార్గెట్‌ చేసి విమర్శలు గుప్పించారు.

 Sushanth Singh Rajput, Suicide Or Murder, Tiktok Star Sachin Tiwari,movie On Sus-TeluguStop.com

అంతటి విమర్శలు చేస్తున్న నేపథ్యంలో గత నె రోజులుగా జనాలు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని చర్చించుకుంటున్నారు.ఈ ట్రెండ్‌ అవుతున్న టాపిక్‌ను సినిమాగా చేస్తే బాగుంటుందనే అభిప్రాయంతో సినిమాను మొదలు పెట్టారు.

‘సూసైడ్‌ ఆర్‌ మర్డర్‌’ అనే టైటిల్‌ తో ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నారు.అచ్చు సుశాంత్‌ మాదిరిగా ఉంటాడు అని పేరు దక్కించుకున్న టిక్‌ టాక్‌ స్టార్‌ సచిన్‌ తివారీ హీరోగా ఈ చిత్రంలో నటించబోతున్నాడు.

సుశాంత్‌ పాత్రను ఆయన పోషించబోతున్నాడు.హీరోగా పరిచయం కాబోతున్న ఆయనకు ఇప్పటికే ట్రైనింగ్‌ కూడా ఇస్తున్నారట.సెప్టెంబర్‌లో సినిమాను ప్రారంభించి కేవలం మూడు నెలల్లో పూర్తి చేసి క్రిస్మస్‌కు విడుదల చేయాలని మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు.

Telugu Sushanth, Sushanthsingh, Tiktok Tiwari-

ఈ చిత్రాన్ని ఎక్కువ శాతం డిజిటల్‌ ఫ్లాట్‌ఫామ్‌పై విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది.కేవలం రెండు గంటల నిడివితో ఈ సినిమాను రూపొందించాలని నిర్ణయించారు.అలాగే సుశాంత్‌ కెరీర్‌ ఆరంభం నుండి ఆత్మహత్య వరకు జరిగిన కీలక సంఘటనలు చూపించబోతున్నారు.

అయితే వివాదాస్పద అంశాలను మాత్రం టచ్‌ చేసేందుకు వారు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube