రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కలిశారు.
రాజ్‌భవన్ లో సోమవారం మధ్యాహ్నం భేటీ అయ్యారు.ఈ భేటీ సందర్భంగా ఇరువురు పలు కీలక అంశాలపై చర్చించారు.
రాష్ట్రంలో కరోనా వైరస్ స్థితిగతులను గవర్నర్‌కు సీఎం కేసీఆర్ వివరించినట్లు తెలుస్తోంది.తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్ కట్టడి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, రోగులకు అందిస్తున్న వైద్యం, తదితర అంశాలను గవర్నర్‌కు వివరించినట్లు సమాచారం.
మరోవైపు సచివాలయం కూల్చివేత, నూతన సచివాలయ నిర్మాణం గురించి కూడా ఇరువురు చర్చించినట్లు తెలుస్తోంది.దీంతో పాటు గవర్నర్ కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాల భర్తీ అంశంపై ఇరువురు చర్చించారని సమచారం.
అదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సీఎం కేసీఆర్ కు ఫోన్ చేసి రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ఆరా తీశారు.మరుసటి రోజే గవర్నర్, కేసీఆర్ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.