ఇటీవల కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది మధుమేహం( Diabetes ) బారిన పడుతూ ముప్పతిప్పలు పడుతున్నారు.ఒక్కసారి వచ్చింది అంటే మధుమేహంతో జీవితకాలం సావాసం చేయాల్సిందే.
అందుకే మధుమేహం అంటేనే భయపడుతుంటారు.అయితే వచ్చాక బాధపడటం కంటే రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మేలు.
అందుకు కొన్ని కొన్ని ఆహారాలు గ్రేట్ గా తోడ్పడతాయి.ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే స్మూతీని( Smoothie ) మీరు కనుక తీసుకుంటే మధుమేహానికి దూరంగా ఉండవచ్చు.
అదే సమయంలో మరెన్నో హెల్త్ బెనిఫిట్స్ ను మీ సొంతం చేసుకోవచ్చు.మరి ఇంతకీ ఆ స్మూతీ ఏంటి.
దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా బ్లెండర్ తీసుకుని అందులో ఒక కప్పు కీర దోసకాయ స్లైసెస్,( Cucumber ) అరకప్పు పీల్ తొలగించిన కివీ పండు స్లైసెస్,( Kiwi ) ఒక అవకాడో ( Avocado ) పల్ప్ వేసుకోవాలి.చివరిగా ఒక గ్లాసు వాటర్ లేదా ఒక గ్లాస్ కోకోనట్ వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.తద్వారా మన స్మూతీ రెడీ అవుతుంది.ఈ గ్రీన్ స్మూతీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.ముఖ్యంగా మధుమేహానికి అడ్డుకట్ట వేయడానికి అద్భుతంగా తోడ్పడుతుంది.

వారానికి కనీసం మూడు సార్లు ఈ స్మూతీని తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవల్స్ లో( Blood Sugar Levels ) హెచ్చుతగ్గులు ఏర్పడకుండా ఉంటాయి.మధుమేహం బారిన పడే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది.అలాగే ఈ స్మూతీని డైట్ లో చేర్చుకోవడం వల్ల వెయిట్ లాస్ అవుతారు.
బాడీ డిటాక్స్ అవుతుంది.కివీ మరియు అవకాడాలో ఐరన్ మెండుగా ఉంటుంది.
అందువల్ల ఈ స్మూతీని తీసుకుంటే రక్తహీనత దూరం అవుతుంది.అంతేకాదు ఈ స్మూతీ ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది.
బాడీని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది.ఎముకలు, కండరాలను బలోపేతం చేస్తుంది.
మరియు చర్మ సంబంధిత సమస్యను సైతం అరికడుతుంది.