పర్యాటకుల సందర్శనాకు నో పర్మిషన్.విశాఖ నగరంలోని ఆర్కే బీచ్‌లో సముద్రం ముందుకొచ్చింది.
దీంతో సమీపంలోని చిల్డ్రన్‌పార్కు 10 అడుగుల మేర కోతకు గురైంది.పార్కులో ప్రహరీ గోడ కూలిపోయింది.
అక్కడ ఉన్న బల్లలు విరిగిపోయాయి.సముద్రం ముందుకు రావడంతో ఆ ప్రాంతంలో పలుచోట్ల భూమి కుంగిపోయి పగుళ్లు ఏర్పడ్డాయి.
ఈ నేపథ్యంలో ఆర్కే బీచ్ వద్దకు పర్యాటకులకు అనుమతి నిషేధించారు.సందర్శకులు అక్కడికి రాకుండా అధికారులు బారికేడ్లు ఏర్పాటు చేశారు.నోవాటెల్ హోటల్ ముందుభాగంలో బారికేడ్లు పెట్టారు.జవాద్ తుపాను నేపథ్యంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతోనే సముద్రం ముందుకొచ్చి ఉంటుందని భావిస్తున్నారు.