టీడీపీ అధినేత చంద్రబాబు మధ్యంతర బెయిల్ కండిషన్లపై ఏపీ హైకోర్టులో వాదనలు ముగిశాయి.దీంతో తీర్పును ఎల్లుండికి వాయిదా వేసింది.
అయితే స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో భాగంగా చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.ఈ బెయిల్ పై సీఐడీ ఐదు నిబంధనలు వర్తింప చేయాలంటూ పిటిషన్ దాఖలు చేసింది.
ఇందులో భాగంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడకూడదని, రాజకీయ సభలతో పాటు ర్యాలీల్లో పాల్గొనకూడదని సీఐడీ షరతులు ప్రతిపాదించిన సంగతి తెలిసిందే.సీఐడీ కండిషన్లపై చంద్రబాబు తరపు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేశారు.
ఈ క్రమంలోనే ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది.