ఎర్రచందనం నేపథ్యంలో ‘అడవి దొంగ’.. ట్రైలర్ విడుదల చేసిన చిత్ర ప్రముఖులు

పర్నిక ఆర్ట్స్ బ్యానర్‌పై రామ్‌తేజ్, రేఖ ఇందుకూరి హీరో హీరోయిన్లుగా కిరణ్ కోటప్రోలు దర్శకత్వంలో నిర్మాత గోపీకృష్ణ నిర్మిస్తున్న చిత్రం ‘అడవి దొంగ’. ఎర్రచందనం నేపథ్యంలో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్ర ట్రైలర్‌ని గురువారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో జరిగిన కార్యక్రమంలో చిత్రయూనిట్ విడుదల చేసింది.

 Adavi Donga Movie Trailer Released, Adavi Donga Movie, Adavi Donga Movie Trailer-TeluguStop.com

ప్రముఖ దర్శకుడు వీరశంకర్, నిర్మాత ఆరా మస్తాన్‌లు ట్రైలర్‌ను విడుదల చేసి చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.ట్రైలర్ చాలా బాగుందని, ఖచ్చితంగా ఈ చిత్రం పెద్ద విజయం సాధిస్తుందని, టీమ్ అందరికీ మంచి పేరు రావాలని వారు అభిలాషించారు.

అనంతరం జరిగిన మీడియా సమావేశంలో దర్శకుడు కిరణ్ కోటప్రోలు మాట్లాడుతూ.‘‘ముందుగా మా చిత్రం ‘అడవి దొంగ’ ట్రైలర్‌ను విడుదల చేసి శుభాకాంక్షలు తెలిపిన పెద్దలందరికీ ధన్యవాదాలు.

ఫారెస్ట్‌, ఎర్రచందనం నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది.అన్ని కమర్షియల్ హంగులతో, రియాలిటీకి దగ్గరగా చిత్రాన్ని రూపొందించడం జరిగింది.

అందరూ ఎంతో కష్టపడి, ఇష్టపడి పనిచేశారు.ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.

త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాము.’’ అని అన్నారు.

హీరో రామ్‌తేజ్ మాట్లాడుతూ.‘‘ఈ చిత్రంలో అవకాశం కలిపించిన దర్శకనిర్మాతలకు నా ధన్యవాదాలు.ఒకానొక దశలో షూట్‌లో నా కాలు విరిగిపోయింది.అయినా సరే డైరెక్టర్ పని చేయించాడు.

ఆయన పని రాక్షసుడు.ఆయన అలా ఉంటాడు కాబట్టే.

సినిమా చాలా రిచ్‌గా వచ్చింది.ఈ సినిమాలో చేసిన అందరికీ మంచి పేరు వస్తుంది.

ఈ సినిమా చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను.మరొక్కసారి అందరికీ ధన్యవాదాలు.

’’ అని తెలిపారు.

Telugu Adavi Donga, Adavidonga, Kiran Kataprolu, Ram Tej, Rekha, Gopi Krishna, T

నిర్మాత గోపీకృష్ణ మాట్లాడుతూ.‘‘ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై.మమ్మల్ని ఆశీర్వదించిన పెద్దలందరికీ కృతజ్ఞతలు.

ముందు ఈ సినిమా అనుకున్నప్పుడు చిన్న సినిమా, చిన్న టీమ్ సరిపోతుంది అనుకున్నాం.కానీ ఇందులో నటించిన వారు, సాంకేతిక నిపుణులందరూ పెద్దగా వర్క్ చేసి పెద్ద సినిమాని చేశారు.

ఒక్క మాటలో చెప్పాలంటే అందరూ కసిగా పని చేశారు.మంచి అవుట్‌ఫుట్ ఇచ్చారు.

రేపు థియేటర్లలో సినిమా చూసే ప్రేక్షకులు కూడా థ్రిల్ అవుతారు.అంత న్యాచురల్‌గా ఈ సినిమా వచ్చింది.

ఈ సందర్భంగా అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.త్వరలోనే చిత్ర విడుదల వివరాలను తెలియజేస్తాము.

’’ అని అన్నారు.

Telugu Adavi Donga, Adavidonga, Kiran Kataprolu, Ram Tej, Rekha, Gopi Krishna, T

రామ్‌తేజ్, రేఖ ఇందుకూరి, వడ్డి మహేష్, రవివర్మ, కరణ్, అప్పు తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: ఎమ్.ఎస్.కిరణ్ కుమార్, సంగీతం: వినోద్ యాజమాన్య, లిరిక్స్: రాంబాబు గోసాల, ఎడిటర్: శివ శర్వాణి, పీఆర్వో: బి.వీరబాబు, బ్యానర్: పర్నిక ఆర్ట్స్, నిర్మాత: గోపీకృష్ణ, కథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: కిరణ్ కోటప్రోలు .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube