అమ్మాయిలను సినిమాల్లోకి రావద్దు అంటున్న శారదా.. కారణం ఏంటి .. ?

తెలుగు సినిమా ఇండస్ట్రీ అనేది చాలా కాలం నుంచి కొనసాగుతున్న విషయం అందరికీ తెలిసిందే అయితే చాలామంది ఆడియన్స్ వాళ్లకు ఉన్న ప్రాబ్లమ్స్ ని మర్చిపోవడం కోసం సినిమా థియేటర్ కి వెళ్లి మూడు గంటల పాటు ఆనందాన్ని పొందడానికి ఉత్సాహ పడుతూ సినిమా చూస్తారు అలా అప్పట్లో వాళ్లని ఎక్కువగా ఉత్సాహ పరిచిన హీరోలు చాలామంది ఉన్నారు వాళ్లలో ఎన్టీఆర్, నాగేశ్వరరావు లాంటి హీరోలు అటు జానపదం, పౌరాణిక సినిమాలు చేస్తూనే సాంఘిక సినిమాల్లో కూడా నటించి మంచి గుర్తింపును సాధించుకుంటు జనాలని ఆనందపరిచేవారు.అయితే వీళ్లు హీరోలుగా కొనసాగుతున్న సమయంలోనే చాలా మంది హీరోయిన్లు కూడా ఇండస్ట్రీకి వచ్చి సక్సెస్ ఫుల్ హీరోయిన్స్ గా గుర్తింపు తెచ్చుకున్నారు అందులో సావిత్రి లాంటి గొప్ప వ్యక్తులు కూడా ఉన్నారు.

 Actress Sarada About Tollywood Industry-TeluguStop.com

సావిత్రి కాకుండా సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు కూడా వాళ్ళకంటూ మంచి గుర్తింపు సాధించుకుని ఇండస్ట్రీలో పెద్ద హీరోయిన్లు గా చాలాకాలం పాటు వెలుగొందిన విషయం తెలిసిందే వాళ్ల లో శారద ఒకరు.

ఈవిడ కూడా మంచి సినిమాలు చేస్తూ చాలా కాలం ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగిందని చెప్పాలి అప్పట్లో అగ్ర హీరోలందరితో నటించి నటిగా తనకు మంచి గుర్తింపు సాధించుకుంది అయితే మొదట్లో సినిమాల్లో చేసినప్పుడు పెద్దగా గుర్తింపు రాలేదు కానీ ఆ తర్వాత మలయాళంలో కొన్ని సినిమాల్లో నటించి నటిగా మంచి గుర్తింపు సాధించుకుంది ముఖ్యంగా విన్సెంట్ గారి దర్శకత్వంలో వచ్చిన తులాభారం అనే సినిమా కి మొదటి సారిగా నేషనల్ అవార్డు వచ్చింది.

 Actress Sarada About Tollywood Industry-అమ్మాయిలను సినిమాల్లోకి రావద్దు అంటున్న శారదా.. కారణం ఏంటి .. -Movie-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆ తర్వాత స్వయంవరం,నిమజ్జనం అనే సినిమాలకి కూడా తనకి నేషనల్ అవార్డ్స్ రావడం అనేది చాలా గర్వంగా చెప్పుకునే విషయం అనే చెప్పాలి మొత్తంగా ఆవిడకు సినిమా కెరీర్లో మూడుసార్లు నేషనల్ అవార్డు వచ్చింది.ఆవిడ ఏ పాత్రలో చేసిన ఆ పాత్రలో ఒదిగిపోయి నటిస్తుంది అని చాలా మంది దర్శక నిర్మాతలు చెబుతూ ఉంటారు అలాంటి నటి గురించి మనం ఎంత ఎక్కువ మాట్లాడిన తక్కువే అవుతుంది అని చెప్పాలి.

Telugu Chiranjeevi Mother Character, Heroines, Mahanati Savitri, Sarada, Stalin Movie, Swayamvaram Movie, Three National Awards, Tollywood, Tollywood Industry, Tollywood Veteran Actress-Telugu Stop Exclusive Top Stories

అయితే శారద గారు అప్పట్లో తెలుగులో చాలా సినిమాల్లో నటించి నటిగా మంచి గుర్తింపు పొందారు ముఖ్యంగా ఆవిడ హీరోయిన్ పాత్రలో చేసి హీరోయిన్ పాత్రలకే అందాన్ని తీసుకొచ్చారు అని చెప్పాలి.ఆవిడ ఏ పాత్ర పోషించినా ఆ పాత్రకి తగ్గట్టుగా తన బాడీ లాంగ్వేజ్ ని మార్చుకుని నటిస్తూ ఉండేది ముఖ్యంగా ఆవిడ కోపానికి సంబంధించిన సీన్లలో నటించినపుడు ఆ సీన్ కట్ చెప్పగానే పక్కనున్న వాళ్ల దగ్గరికి వచ్చి కూర్చొని నార్మల్ గా క్యాజువల్ గా మాట్లాడుతూ జోకులు చేసే వారు కొందరు ఆర్టిస్టులు అయితే ఏదైనా కోపానికి సంబంధించిన సీన్ చేసేటప్పుడు ఆ సీన్ చేసే ముందు చేసిన తరువాత చాలా సేపటి వరకు అదే మూడ్ లో ఉంటారు కానీ శారద గారు ఒకసారి యాక్షన్ అంటే ఆ మూడ్ లోకి వెళ్ళిపోయి యాక్టింగ్ చేసి మళ్లీ కట్ చెప్పిన తర్వాత సినిమాతో సంబంధం లేకుండా మామూలుగా క్యాజువల్ గా ఉంటారు.

Telugu Chiranjeevi Mother Character, Heroines, Mahanati Savitri, Sarada, Stalin Movie, Swayamvaram Movie, Three National Awards, Tollywood, Tollywood Industry, Tollywood Veteran Actress-Telugu Stop Exclusive Top Stories

శారద లా ఉండటం అనేది చాలా తక్కువ మంది నటుల్లో మనం చూస్తూ ఉంటాం శారద చాలా సినిమాల్లో నటించిన తర్వాత తెలుగుదేశం పార్టీ తరఫున తెనాలి నుంచి ఎంపీగా కూడా ఎన్నికయ్యారు ఆ తర్వాత కొద్ది రోజుల పాటు పొలిటికల్ గా తెలుగుదేశం పార్టీలో కొనసాగి ఆ తర్వాత మళ్లీ రాజకీయాల నుంచి వెనుదిరిగి వచ్చారు అయితే ఎన్టీఆర్, నాగేశ్వరావు, కృష్ణ , శోభన్ బాబు లాంటి హీరోల సమయంలో హీరోయిన్ గా నటించిన తను చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ , వెంకటేష్ లాంటి హీరోలకి తల్లి పాత్రలను పోషించి నటిగా మంచి గుర్తింపు సాధించింది చిరంజీవి హీరోగా వచ్చిన స్టాలిన్ సినిమాలో కూడా చిరంజీవి తల్లిగా నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. అలాగే వి వి వినాయక్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన యోగి సినిమాలో కూడా శారద గారు ప్రభాస్ తల్లిగా నటించి మంచి గుర్తింపు సాధించడంతో పాటు ఆ సినిమా చూసిన జనం కళ్ళల్లో నీళ్ళు కూడా తెప్పించారు అని చెప్పాలి అంత బాగా నటించి మెప్పించారు.

Telugu Chiranjeevi Mother Character, Heroines, Mahanati Savitri, Sarada, Stalin Movie, Swayamvaram Movie, Three National Awards, Tollywood, Tollywood Industry, Tollywood Veteran Actress-Telugu Stop Exclusive Top Stories

ఇదిలా ఉంటే ఆవిడని ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో ఈతరం హీరోయిన్స్ ని చూసినప్పుడు మీకేమనిపిస్తుంది అని అడిగితే ఆవిడ ఇప్పుడున్న హీరోయిన్లు వస్తున్నారు ఎక్కువగా హంగులు ఆర్భాటాలకు పోతూ ఒకటి రెండు సినిమాలు చేసి ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోతున్నారు కానీ మా సమయంలో అలా ఉండేది కాదు ఒక సినిమా చేశాము అంటే అది మాకు హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చేది మేము చాలా కాలం పాటు ఇండస్ట్రీలో కొనసాగడానికి ప్రయత్నాలు చేస్తూ ఉండే వాళ్ళం కానీ ఇప్పుడు ఉన్న వారు వస్తున్నారు ఒక సినిమా చేశాము అనుకుంటున్నారు గుర్తింపు తెచ్చుకుంటున్నారు అంతలోనే ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోతున్నారు ఆ విషయంలో వాళ్ళని చూస్తే బాధగా అనిపిస్తూ ఉంటుంది అని ఆవిడ ఒక సందర్భంలో తన అభిప్రాయాన్ని తెలియజేశారు…

#Sarada #Stalin #National Awards #Heroines #Swayamvaram

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు