నిజం సినిమా( Nijam Movie ) ఎంత పెద్ద సూపర్ హిట్ అయిందో స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు.ఈ మూవీ మహేష్ బాబు, గోపీచంద్ కెరీర్స్‌లో చాలా స్పెషల్ గా నిలిచిపోతుంది.
ఈ మూవీలో మహేష్ బాబు తల్లిగా నటించిన తాళ్లూరి రామేశ్వరి( Talluri Rameshwari ) కూడా బాగా హైలైట్ అయింది.ఆమె తన పాత్ర మేరకు నట విశ్వరూపం చూపించింది.
ఈ సినిమాతో ఆమె తెలుగులో చాలా పాపులర్ అయ్యింది.ఈ మూవీకి తేజ దర్శకత్వం వహించాడు.అంతే కాదు కథ కూడా అందించే తానే ప్రొడ్యూస్ చేశాడు.2003న రిలీజ్ అయిన ఈ సినిమా చాలా నంది అవార్డులను గెలుచుకుంది.రామేశ్వరి కూడా బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్‌గా ఒక నంది అవార్డును గెలుచుకుంది.
అయితే ఈ సినిమాలో ఆమె పాత్ర మొదటి నుంచి చివరి వరకు ఉంటుంది.
ఆ పాత్రకి ఎంతో ప్రాధాన్యత కూడా ఉంటుంది.అలాంటి క్యారెక్టర్ చేసినందుకు తాను చాలా తక్కువ డబ్బులు తీసుకున్నానని తాజాగా రామేశ్వరి ఒక ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేసింది.
అసలు ఈ సినిమా అవకాశం ఎలా వచ్చిందో, డబ్బులు తాను తక్కువ ఎందుకు తీసుకున్నానో వివరించింది.

“నా పేరు తేజ( Director Teja ) నేను ఒక సినిమా తీస్తున్నాను.ఆ సినిమాలో ఒక మదర్ క్యారెక్టర్ ఖాళీగా ఉంది.చాలా ఇంట్రెస్టింగ్ రోల్, మీకు చేయడానికి ఏమైనా అభ్యంతరమా?” అని ఫోన్ చేసి డైరెక్టర్ తేజ అడిగాడని రామేశ్వరి తెలిపింది.తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పినప్పుడు తేజ తనను ఒకసారి హైదరాబాద్ కి పిలిచాడట.ఎప్పుడు రమ్మంటారో చెప్పమని అడిగితే మరుసటి రోజు ఉదయమే రమ్మని కోరాడని తెలిపింది.
నెక్స్ట్ డే మార్నింగ్ తేజ ఆఫీస్ కి వెళ్ళిన తర్వాత అరగంటలోనే నిజం సినిమా కథంతా దర్శకుడు చెప్పాడని పేర్కొంది.ఈ క్యారెక్టర్ లో చేస్తారా లేదా అని అడిగినప్పుడు “మంచి క్యారెక్టర్ కదా తప్పకుండా చేస్తాన”ని చెప్పిందట.

అయితే ఆ సమయంలో ఎంత డబ్బులు అడగాలో, ఎంత డబ్బులు ఆఫర్ చేస్తే కాదనాలో తనకు తెలియలేదట.తేజ ఎంత ఆఫర్ చేస్తే అంత డబ్బులకు మహేష్ బాబు మదర్ క్యారెక్టర్( Mahesh Babu Mother Role ) చేసేందుకు ఒప్పుకున్నానని చెప్పింది.అయితే తర్వాత ఈ సంగతి తెలిసిన చాలా మంది అంత పెద్ద రోల్ కి అంత తక్కువ మనీ ఎందుకు తీసుకున్నావు అని ప్రశ్నించారట.దానిపై తాజా ఇంటర్వ్యూలో రామేశ్వరి స్పందిస్తూ “అంత తక్కువ డబ్బులు ఇచ్చినా ఏం పర్లేదు, మంచి క్యారెక్టర్ ఇచ్చాడు, అదే సంతృప్తి” అని ఆమె చెప్పింది.నిజం సినిమా దాదాపు రూ.6.5 కోట్లతో తీస్తే రూ.21 కోట్లకు అమ్ముడుపోయింది.దానివల్ల తేజకు బాగానే లాభాలు వచ్చాయి.