తెలుగులో సూపర్ ఫాం లో ఉన్న పూజా హెగ్దే ఇక్కడ వరుస స్టార్ అవకాశాలతో హంగామా చేస్తుంది.పూజా సినిమాలో ఉంటే ఆ సినిమా హిట్ అనే సెంటిమెంట్ ఏర్పడటంతో అమ్మడి కోసం దర్శక నిర్మాతలు వెంటపడుతున్నారు.
రాధే శ్యాం లో ప్రభాస్ తో.మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ తో అఖిల్ తో జోడీ కడుతున్న ఈ అమ్మడు లేటెస్ట్ గా కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ సినిమాలో ఛాన్స్ అందుకుంది.తమిళంలో మూగాముడి తర్వాత చాలా గ్యాప్ తో సినిమా చేస్తుంది పూజా హెగ్దే.
ఇక వరుస అవకాశాలు ఆమెకు క్రేజ్ తీసుకు రాగా ఇదే ఛాన్స్ అని అమ్మడు రెమ్యునరేషన్ కూడా పెంచేసిందని టాక్.ప్రస్తుతం సినిమాకు 1.5, 2 కోట్ల దాకా ఛార్జ్ చేస్తున్న పూజా హెగ్దే ఇక మీదట 3 కోట్లు ఇస్తేనే సినిమా అనేస్తుందట.నిర్మాతలు కూడా చేసేదేమి లేక అమ్మడు అడిగినంత ఇచ్చి ఆమెను తీసుకుంటున్నారని తెలుస్తుంది.టాలీవుడ్ లో ప్రస్తుతం పూజా హెగ్దే హవా నడుస్తుందని చెప్పొచ్చు.
ఆమె చేస్తున్న సినిమాలతో పాటుగా అమ్మడు సోషల్ మీడియాలో కూడా రచ్చ చేస్తుంది. తను చేసే ప్రతి పోస్ట్.పెట్టే ప్రతి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడం ఆమెకు మరింత క్రేజ్ తెచ్చిపెడుతుంది.