సింహం సింగిల్‌గా వస్తుంది.పందులే గుంపులుగా వస్తాయని శివాజీ సినిమాలో రజనీకాంత్ వదిలిన డైలాగ్ అందరికి గుర్తుండే ఉంటుంది.
ఇక కేసీఆర్ కూడా ఒక డైలాగ్ వదిలారు.ఈ బక్కపలచని మనిషిని ఎదుర్కోవడానికి ఢీల్లీ నుండి పెద్ద పెద్ద నేతలు దిగితున్నారని.
ఈ రెండింటికి దగ్గరి సంబంధం ఉండగా, ఈ డైలాగ్‌లు హుజురాబాద్ ఉప ఎన్నికకు సింక్ అవుతున్నాయి.అదేమంటే ఈటల ఒక్కడు.కానీ టీఆర్ఎస్ మాత్రం సింహంలా వేటాడడానికి సమాయత్తం అవుతుంది.ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హుజురాబాద్ ఉప ఎన్నికలో కేవలం ఈటలను ఓడించడానికి తీవ్రంగా వలసలను ప్రోత్సహిస్తుందట.
ఈ క్రమంలో ఇల్లంతకుంటకు చెందిన బీజేపీ మండల అధ్యక్షుడు నన్నబోయిన రవియాదవ్ 200 మంది పార్టీ కార్యకర్తలతో నిన్న హైదరాబాద్‌లో హరీశ్‌రావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితర సమక్షంలో టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్న సందర్భంగా ఈ కార్యక్రమంలో హరీష్ రావు ఈటల పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి త్వరలో జరగనున్న ఉప ఎన్నిక తర్వాత హుజూరాబాద్‌కు ఈటల రాజేందర్ నుంచి విముక్తి లభిస్తుందని, కేవలం తన ఆస్తులను కాపాడుకోవడానికే ఈటల ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.