'తలైవి'లో పది నిముషాలు కట్ చేయబోతున్నారట.. ఎందుకంటే ?

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఎప్పుడు ఏదొక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది.అందుకే ఈమెకు ఫైర్ బ్రాండ్ అనే ముద్ర పడింది.

 Bollywood Queen Kangana Ranaut Thalaivi Movie Latest Update, Kangana Ranaut, Tha-TeluguStop.com

బాలీవుడ్ బడా హీరోలను సైతం గడగడ లాడిస్తూ ఉంటుంది.ఎంత వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా సినిమాల్లో నటన మాత్రం అద్భుతంగా ఉంటుంది.

ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా తన టాలెంట్ తో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.

తన సినిమాలను కూడా ఇలాగే ఏదొక కాంట్రవర్సీ చేసి ఫ్రీ గా ప్రమోట్ చేసుకుంటుంది.

ప్రస్తుతం కంగనా ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో ‘తలైవి‘ సినిమా చేస్తుంది.ఈ సినిమాలో కంగనా రనౌత్ జయలలిత పాత్రలో నటిస్తుంది.ఈ సినిమా ను మొదట్లో అంతగా పట్టించుకోక పోయినా విడుదల అయ్యిన ట్రైలర్ చుసిన తర్వాత ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.ఈ ట్రైలర్ లో కంగనా ను చుస్తే జయలలితను చూసి నట్టుగానే ఉందని పలువురు ఇప్పటికే కామెంట్స్ చేసారు.

Telugu Bollywood, Alvijay, Kangana, Kangana Ranaut, Kanganaranaut, Kollywood, Th

ఈ సినిమా విడుదలకు సిద్దమైన కరోనా కారణంగా వాయిదా పడింది.ఇప్పుడు పరిస్థితులు కొద్దిగా మెరుగవడంతో ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.అయితే తాజాగా ఈ సినిమా గురించి ఒక అప్డేట్ బయటకు వచ్చింది.ఈ సినిమా 10 నిముషాల నిడివిని తగ్గించ బోతున్నారని తెలుస్తుంది.ఈ సినిమా మొత్తం నిడివి రెండు గంటల ఏభై ఐదు నిముషాలు వచ్చిందట.

Telugu Bollywood, Alvijay, Kangana, Kangana Ranaut, Kanganaranaut, Kollywood, Th

అందులో ఒక పది నిముషాల సినిమాను తగ్గిచడానికి మేకర్స్ ప్రయత్నం చేస్తున్నారని టాక్.ఈ సినిమా కోసం కంగనా చాలా కష్టపడింది.జయలలిత 18 సంవత్సరాల వయసు నుండి 60 సంవత్సరాల వయసు వరకు ఈ సినిమాలో చూపించబోతున్నారు.

మొత్తం ఐదు గెటప్స్ లో కంగనా కనిపించ బోతుంది.ఈ సినిమా కొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు.

మరి చూడాలి ఈ సినిమా ఎంత వరకు ఆకట్టుకుంటుందో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube