ప్రముఖ నటుడు రావు గోపాలరావు కొడుకు రావు రమేష్ నటుడిగా సినిమా ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.మొదట స్టిల్ ఫోటోగ్రాఫర్ కావాలని అనుకున్న రావు రమేష్ ఊహించని విధంగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.
శ్రీకాకుళం జిల్లాలో జన్మించిన రావు రమేష్ చెన్నైలో పెరిగారు.ప్రారంభంలో సినిమాలపై ఆసక్తి లేకుండానే ఎంట్రీ ఇచ్చిన రావు రమేష్ కు గమ్యం, కొత్త బంగారు లోకం సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపు దక్కింది.
అనుకోకుండా సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన రావు రమేష్ ప్రస్తుతం వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నారు.మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన నాయట్టు సినిమా తెలుగులో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే.
గీతా ఆర్ట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రావు రమేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు.ఈ సినిమా కొరకు ఎక్కువ సంఖ్యలో కాల్షీట్లు ఇవ్వాల్సి ఉండటంతో రావు రమేష్ ఈ సినిమా కోసం ఏకంగా కోటిన్నర రూపాయలు తీసుకుంటున్నారని సమాచారం.

రెమ్యునరేషన్ విషయంలో ఈ మొత్తం రికార్డ్ అనే చెప్పాలి.క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన రావు రమేష్ త్వరలోనే ఈ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నారని సమాచారం.రావు రమేష్ కు స్టార్ హీరోల సినిమాల్లో కూడా మంచి పాత్రలు వస్తున్నాయి.తనకు మాత్రమే సొంతమైన యాక్టింగ్ తో రావు రమేష్ మెప్పిస్తుండటం గమనార్హం.ప్రస్తుతం నాయట్టు సినిమా స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని సమాచారం.