జేఎన్టీయూలో పెంచిన యూజీ ,పీజీ ఫీజులను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ విద్యార్థి సంఘాలు జే ఎన్ టీ యూ అడ్మినిస్ట్రేటివ్ భవనం ముందు ఆందోళనకు దిగారు.ప్రభుత్వ యూనివర్సిటీలలో చదువుకోవాలా ,చదువును కొనుక్కోవాలన్నా రీతిలో ఫీజులను పెంచుతున్నారని విద్యార్థి సంఘాలు ఆరోపించాయి.
ఎంటెక్ 540 సీట్లకు గానూ 317 సీట్లు సెల్ఫ్ ఫైనాన్స్, ఇంటిగ్రేటెడ్ కేటాయించారని ఇది ప్రభుత్వ యూనివర్సిటీ ఆఫ్ ప్రైవేట్ యూనివర్సిటీ అని ప్రశ్నించారు.
ఫీజుల దోపిడీ కి మాత్రమే ఫీజుల పెంపు చేశారని వెంటనే ఫీజులు తగ్గింపు చేయకపోతే ప్రగతి భవన్ ను ముట్టడిస్తామని కేసీఆర్ ఫామ్ హౌస్ ను బద్దలు కొడతామని హెచ్చరించారు.
ముఖ్యమంత్రి ఫీజులను పెంచి తన మందు లో కలుపుకునే చూడ మాదిరిగా చదువులను భ్రష్టు పట్టిస్తున్నారని విద్యార్థి సంఘాలు దుయ్యబట్టారు.విద్యార్థి సంఘం నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.