ప్రియుడి మాటలు నమ్మి అమ్మాయిలా మారిన అబ్బాయి చివరికి...

లోకంలో కొన్ని పోకడలు చూస్తే పెళ్లి అనే బంధానికి అసలు విలువ ఉందోలేదో అనే సందేహం కలగక మానదు.అందుకు ఉదాహరణగా తెలంగాణ రాష్ట్రంలో పెద్దపల్లి  జిల్లాలో ప్రియుడి మాటలు నమ్మి అమ్మాయిలా మారిన అబ్బాయిని పెళ్లి చేసుకుని చివరికి నచ్చలేదని వదిలేసిన ఘటన ఉదాహరణగా చెప్పవచ్చు.

 A Young Man In Married Transgender-TeluguStop.com

వివరాల్లోకి వెళితే స్థానిక జిల్లాకి చెందిన బొమ్మారెడ్డి పల్లికి చెందిన సంతోష్ అదే జిల్లా ధర్మారం ప్రాంతానికి చెందిన అభిషేక్ అనే యువకుడు మంచి స్నేహితులు.అయితే ఈ కొద్ది రోజులు గడిచిన తర్వాత వీరి మధ్య స్నేహం కాస్త ప్రేమకి దారి తీసింది.

అయితే ఈ క్రమంలో అభిషేక్ చిన్నప్పటి నుంచి హార్మోన్స్ అసమతుల్యత కారణంగా అతడిలో కొంచెం ఆడపిల్లల లక్షణాలు ఎక్కువగా ఉండేవి.

ఈ విషయాన్ని సంతోష్ కి తెలియజేయగా అతడు తన తోటి స్నేహితులకి చెప్పాడు.

దీంతో అందరూ అభిషేక్ ని అందరూ అపహేళన చేస్తుండగా అతడు తనలో తానే కుమిలిపోయేవాడు.దీంతో అభిషేక్ బాధని చూసి తట్టుకోలేకపోయిన సంతోష్ బాధపడొద్దని నేను నీకు అండగా ఉంటానని చెప్పాడు అంతేగాక అభిషేక్ నువ్వు పూర్తిగా ఆడపిల్లలా మారితే నిన్ను నేను పెళ్లి చేసుకుని మంచి జీవితాన్ని ఇస్తానని నమ్మించాడు.

ఇది నమ్మిన అభిషేక్ ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే ట్రాన్స్ జెండర్ గా ఆపరేషన్ చేయించుకుని పూర్తిగా ఆడపిల్లలా మారిపోయాడు.అంతేగాక అర్చన అనే నామకరణం కూడా చేసుకున్నాడు.

దీంతో ఈ సంవత్సరంలోని అక్టోబర్ నెలలో ఇద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు.

Telugu Abhishek, Archana, Santhosh, Telangana, Transgender-

అయితే పెళ్ళైన కొద్ది రోజులు బాగానే సంతోషంగా గడిపారు.ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ గత కొద్ది రోజులుగా సంతోష్ అర్చనని దూరంగా పెట్టాడు.దాంతో ఎందుకు తనతో అలా ప్రవర్తిస్తున్నావని అర్చన సంతోష్ ని అడుగగా నిన్ను పెళ్లి చేసుకోవడం తన తల్లిదండ్రులకు ఇష్టం లేదని అందుకే మనం విడిపోదామని అంటున్నాడని అర్చన చెబుతోంది.

దీంతో మోసపోయినని గ్రహించిన అర్చన తనకు ఎలాగైనా న్యాయం చేయాలంటూ దగ్గర్లోని పోలీస్ స్టేషన్ లోని పోలీసులని సంప్రదించింది.అలాగే తనకు న్యాయం జరిగేంతవరకూ పోరాడుతానని అర్చన ఆవేదన వ్యక్తం చేస్తోంది.

అయితే అర్చనకి జరిగిన అన్యాయాన్ని గురించి తెలుసుకున్న తోటి  ట్రాన్స్ జెండర్లు ఆమెకు మద్దతు తెలుపుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube