ప్రియుడి మాటలు నమ్మి అమ్మాయిలా మారిన అబ్బాయి చివరికి...

ప్రియుడి మాటలు నమ్మి అమ్మాయిలా మారిన అబ్బాయి చివరికి…

లోకంలో కొన్ని పోకడలు చూస్తే పెళ్లి అనే బంధానికి అసలు విలువ ఉందోలేదో అనే సందేహం కలగక మానదు.

ప్రియుడి మాటలు నమ్మి అమ్మాయిలా మారిన అబ్బాయి చివరికి…

అందుకు ఉదాహరణగా తెలంగాణ రాష్ట్రంలో పెద్దపల్లి  జిల్లాలో ప్రియుడి మాటలు నమ్మి అమ్మాయిలా మారిన అబ్బాయిని పెళ్లి చేసుకుని చివరికి నచ్చలేదని వదిలేసిన ఘటన ఉదాహరణగా చెప్పవచ్చు.

ప్రియుడి మాటలు నమ్మి అమ్మాయిలా మారిన అబ్బాయి చివరికి…

వివరాల్లోకి వెళితే స్థానిక జిల్లాకి చెందిన బొమ్మారెడ్డి పల్లికి చెందిన సంతోష్ అదే జిల్లా ధర్మారం ప్రాంతానికి చెందిన అభిషేక్ అనే యువకుడు మంచి స్నేహితులు.

అయితే ఈ కొద్ది రోజులు గడిచిన తర్వాత వీరి మధ్య స్నేహం కాస్త ప్రేమకి దారి తీసింది.

అయితే ఈ క్రమంలో అభిషేక్ చిన్నప్పటి నుంచి హార్మోన్స్ అసమతుల్యత కారణంగా అతడిలో కొంచెం ఆడపిల్లల లక్షణాలు ఎక్కువగా ఉండేవి.

ఈ విషయాన్ని సంతోష్ కి తెలియజేయగా అతడు తన తోటి స్నేహితులకి చెప్పాడు.దీంతో అందరూ అభిషేక్ ని అందరూ అపహేళన చేస్తుండగా అతడు తనలో తానే కుమిలిపోయేవాడు.

దీంతో అభిషేక్ బాధని చూసి తట్టుకోలేకపోయిన సంతోష్ బాధపడొద్దని నేను నీకు అండగా ఉంటానని చెప్పాడు అంతేగాక అభిషేక్ నువ్వు పూర్తిగా ఆడపిల్లలా మారితే నిన్ను నేను పెళ్లి చేసుకుని మంచి జీవితాన్ని ఇస్తానని నమ్మించాడు.

ఇది నమ్మిన అభిషేక్ ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే ట్రాన్స్ జెండర్ గా ఆపరేషన్ చేయించుకుని పూర్తిగా ఆడపిల్లలా మారిపోయాడు.

అంతేగాక అర్చన అనే నామకరణం కూడా చేసుకున్నాడు.దీంతో ఈ సంవత్సరంలోని అక్టోబర్ నెలలో ఇద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు.

"""/" / అయితే పెళ్ళైన కొద్ది రోజులు బాగానే సంతోషంగా గడిపారు.ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ గత కొద్ది రోజులుగా సంతోష్ అర్చనని దూరంగా పెట్టాడు.

దాంతో ఎందుకు తనతో అలా ప్రవర్తిస్తున్నావని అర్చన సంతోష్ ని అడుగగా నిన్ను పెళ్లి చేసుకోవడం తన తల్లిదండ్రులకు ఇష్టం లేదని అందుకే మనం విడిపోదామని అంటున్నాడని అర్చన చెబుతోంది.

దీంతో మోసపోయినని గ్రహించిన అర్చన తనకు ఎలాగైనా న్యాయం చేయాలంటూ దగ్గర్లోని పోలీస్ స్టేషన్ లోని పోలీసులని సంప్రదించింది.

అలాగే తనకు న్యాయం జరిగేంతవరకూ పోరాడుతానని అర్చన ఆవేదన వ్యక్తం చేస్తోంది.అయితే అర్చనకి జరిగిన అన్యాయాన్ని గురించి తెలుసుకున్న తోటి  ట్రాన్స్ జెండర్లు ఆమెకు మద్దతు తెలుపుతున్నారు.

దుబాయ్ హోటల్‌లో ఇండియన్ కోటీశ్వరుడి వింత చేష్ట.. సిగ్గులేదా అంటూ నెటిజన్లు ఫైర్!