విశాఖలో నిర్వహించనున్న కాపునాడు సమావేశంలో ట్విస్ట్ నెలకొంది.ఈ సమావేశానికి వైసీపీ దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.
రాధా – రంగా అసోసియేషన్ పేరుతో కాపునాడు సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు.అయితే కాపునాడు బహిరంగ సభలో టీడీపీ, జనసేన నేతలు మాత్రమే ఇందులో పాల్గొనే అవకాశం ఉన్నట్లు సమాచారం.
వైసీపీకి చెందిన నేతలు ఎవరూ హజరు కావొద్దని పార్టీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది.
వంగవీటి రంగా వర్ధంతిని పురస్కరించుకుని కాపు సామాజికవర్గం నేతలు ఈ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు.
విశాఖలోని ఏఎస్ రాజా గ్రౌండ్స్ లో పార్టీలకు అతీతంగా ఈ సభ జరుగుతున్న విషయం తెలిసిందే.గంటా శ్రీనివాస్ ఈ సభకు నాయకత్వం వహిస్తుండగా 2024 సార్వత్రిక ఎన్నికల నాటికి కాపు సామాజిక వర్గం రాజ్యాధికారాన్ని ఎలా పొందాలనే విషయంపై చర్చించనున్నారు.
అయితే ఇప్పుడు వైసీపీ దూరం కావడం హాట్ టాపిక్ గా మారింది.