కాంగ్రెస్ కు రేవంత్ గండం.. చిక్కులు తప్పవా ?

కర్నాటక ఎన్నికల విజయం తరువాత టి కాంగ్రెస్ లో జోష్ గట్టిగానే పెరిగింది.వచ్చే ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీనే అని, అధికారం కూడా హస్తం పార్టీదే అని కమలనాథులు ధీమా వ్యక్తం చేస్తూ వచ్చారు.

 A Threat To Congress With Revanth Reddy Details, Congress , Revanth Reddy, Tpcc-TeluguStop.com

అందుకు తగ్గట్టుగానే వ్యూహరచనతో నిత్యం హస్తం పార్టీ వార్తల్లో నిలుస్తూ వస్తోంది.ప్రస్తుతం బీజేపీతో పోల్చితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ( Telangana Congress ) ప్రభావమే గట్టిగా ఉంది.

ఈ నేపథ్యంలో ఏ తప్పటడుగు వేసిన హస్తం పార్టీకి డ్యామేజ్ గట్టిగానే జరుగుతుంది.ఇటీవల టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి( Revanth Reddy ) చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ దూకుడుకి కాస్త బ్రేక్ వేసినట్లుగానే కనిపిస్తోంది.

Telugu Congress, Farmers, Farmers Votes, Revanth Reddy, Telangana-Politics

బి‌ఆర్‌ఎస్ ను ఇరకాటంలో పెట్టబోయి తాను ఇరకాటంలో చిక్కుకున్నారు రేవంత్ రెడ్డి.రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ అవసరం లేదని, మూడు గంటల కరెంట్ చాలని.ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్ది.ఈ వ్యాఖ్యలను బి‌ఆర్‌ఎస్ నేతలు( BRS ) ఘాటైన విమర్శనస్త్రాలుగా వాడుకుంటున్నారు.కాంగ్రెస్ పార్టీ రైతుల ద్రోహి పార్టీ అని, రైతులకు మంచి జరగడం హస్తం పార్టీ నేతలకు ఇష్టం లేదని.ఇలా రకరకాల విమర్శలతో కాంగ్రెస్ ను డిఫెన్స్ లోకి నేడుతున్నారు బి‌ఆర్‌ఎస్ నేతలు.

దీంతో నిన్న మొన్నటి వరకు కాస్త దూకుడుగా వ్యవహరించిన హస్తం పార్టీ.ఇప్పుడు చేసిన వ్యాఖ్యలను కవర్ చేసుకునే పనిలో పడింది.

Telugu Congress, Farmers, Farmers Votes, Revanth Reddy, Telangana-Politics

ఎన్నికల్లో ఏ పార్టీ విజయనికైనా రైతుల ఓటు బ్యాంక్( Farmers Votes ) చాలా కీలకం.అందుకే ప్రతి ఒక్క రాజకీయ నేత ముందు రైతులకు ఫేవర్ గా ఉండే హామీలనే ప్రకటిస్తూ ఉంటాడు.రైతులు కూడా తమకు అనుకూలంగా హామీలిచ్చే పార్టీల వైపే మొగ్గు చూపుతుంటారు.ఈ నేపథ్యంలో రైతులకు ఉచిత కరెంట్ అవసరం లేదనే విధంగా రేవంత్ రెడ్ది వ్యాఖ్యానించడం.

కాంగ్రెస్ పార్టీకి రైతులను దూరం చేయడమే అవుతుందనేది కొందరి అభిప్రాయం.దీంతో హస్తం పార్టీ రేవంత్ చేసిన వ్యాఖ్యలను ఎలా కవర్ చేసుకోవలో అర్థంకాని పరిస్థితిలో ఉంది.

మొత్తానికి అధికారమే లక్ష్యంగా తెలంగాణలో అడుగులు వేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ చీఫ్ రేవంత్ రెడ్ది చేసిన వ్యాఖ్యలు కొత్త చిక్కులనే తెచ్చిపెట్టాయి.మరి తలనొప్పి నుంచి హస్తం పార్టీ ఎలా బయట పడుతుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube