శాటిలైట్ కెమెరాకు చిక్కిన అరుదైన పాలసముద్రం

ఈ విశాల విశ్వంలో మనకు తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయి.శాస్త్రవేత్తలు తమ సుదీర్ఘ పరిశోధన ద్వారా కొన్నింటిని కనిపెట్టినా, విశ్వసించే వారు చాలా తక్కువ.

 A Rare Blue Sea Caught On A Satellite Camera,satelite, Cemra, Milk Valley, Viral-TeluguStop.com

ఆ విషయాలను కొట్టిపారేస్తుంటారు.అయితే చాన్నాళ్లకు ఆ విషయాలు నిజమైనవని ప్రూవ్ అయిన తర్వాత నాలిక్కరచుకుంటారు.

అయితే మానవ ఊహకు అందని ఎన్నో విషయాలను సైన్స్ కనుగొంది.అందులో పాలపుంత కూడా ఒకటి.

ఇప్పటి వరకు పాలపుంత అంటే అదో ఊహ మాత్రమే అని చాలా మంది బలంగా నమ్ముతారు.అయితే తాజాగా అంతరిక్షం నుంచి తీసిన ఒక ఫొటో అనుమానాలను పటాపంచలు చేసేసింది.

పాలపుంత అనేది ఊహ కాదని, నిజంగానే ఉందని తెలిపింది.దానికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.

పాల సముద్రం గురించి అమెరికాకు చెందిన ఎందరో పరిశోధకులు కొన్నేళ్లుగా తీవ్రంగా శోధిస్తున్నారు.ముఖ్యంగా 2019 నుంచి వారు పాలసముద్రంపై విస్తృతంగా పరిశోధనలు చేస్తున్నారు.అప్పట్లో కేవలం ఒకటో రెండో సార్లు పాలపుంతలను చూడొచ్చని వారు అంచనా వేశారు.తాజాగా దక్షిణ ఇండోనేషియా ప్రాంతంలో అరుదైన దృశ్యం కంటపడింది.

అంతరిక్షం నుంచి శాటిలైట్ తీసిన ఓ ఫొటో ద్వారా అరుదైన పాలపుంత సాక్షాత్కరించింది.దీనిని చూసిన వారు ఎవరూ వావ్ అనకుండా ఉండలేరు.

ఈ పాలసముద్రాలు బయోల్యూనెసెంట్ అనే బాక్టీరియా ద్వారా ఏర్పడతాయి.సముద్రంలో ఏర్పడే వాతావరణ పరిస్థితుల ఆధారంగా ఈ బాక్టీరియాలకు ఒకదానికొకటి కనెక్షన్ ఏర్పడుతుంది.

ఇలా పాలసముద్రాలు అత్యంత అరుదగా ఏర్పడుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.ప్రస్తుతం కనిపించిన దక్షిణ ఇండోనేషియా తీరంలో తరచూ ఇలాంటివి తాము చూశామని స్థానికులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube