తక్కువ బరువుతో బాధపడుతున్నారా.. వర్రీ వద్దు ఇవి ట్రై చేయండి!

ప్రస్తుత రోజుల్లో అధిక బరువు అనేది ఎంతో మందిని వేధిస్తున్న సమస్య.అయితే అధిక బరువు బాధితులే కాదు తక్కువ బరువుతో( less weight ) బాధపడుతున్న వారు కూడా ఎంతో మంది ఉన్నారు.

 These Two Smoothies Help You Gain Healthy Weight! Smoothies, Healthy Smoothies,-TeluguStop.com

వయసుకు తగ్గ బరువు లేకపోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.చాలా వీక్ గా ఉంటారు.

ఏ పని చేయలేకపోతుంటారు.ఈ క్రమంలోనే బరువు పెరగడం కోసం తెగ ప్రయత్నిస్తూ ఉంటారు.

మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే అస్స‌లు వ‌ర్రీ అవ్వకండి.హెల్తీగా వెయిట్ గెయిన్‌ అవ్వడానికి ఇప్పుడు చెప్పబోయే రెండు స్మూతులు చాలా బాగా సహాయపడతాయి.ఈ స్మూతీల‌ను డైట్ లో భాగం చేసుకుంటే సులభంగా వెయిట్ గెయిన్ అవ్వవచ్చు.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ స్మూతీలు ఏంటో వాటిని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

Telugu Avocadopeanut, Tips, Healthy, Latest-Telugu Health

అవకాడో పీనట్ స్మూతీ( Avocado Peanut Smoothie ) ఇది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే బరువు పెంచడానికి సహాయపడుతుంది.ఈ స్మూతీ కోసం బ్లెండర్ తీసుకుని అందులో ఒక అవకాడో పల్ప్ ను వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ పీనట్ బటర్, రెండు గింజ తొల‌గించిన‌ ఖర్జూరాలు( Dates ), వన్ టేబుల్ స్పూన్ కోకో పౌడర్ ( Cocoa powder )మరియు ఒక గ్లాస్ బాదం పాలు( Almond milk ) వేసుకుని మెత్తగా బ్లెండ్ చేసుకుంటే మన స్మూతీ సిద్ధమవుతుంది.

ఈ అవకాడో పీనట్ స్మూతీ మంచి కొవ్వులతో నిండి ఉంటుంది.అందువల్ల బరువు పెరగడానికి ఈ స్మూతీ మీకు ఉత్తమంగా సహాయపడుతుంది.

Telugu Avocadopeanut, Tips, Healthy, Latest-Telugu Health

అలాగే వెయిట్ గెయిన్ అవ్వడానికి స్ట్రాబెర్రీ బనానా స్మూతీ ( Strawberry Banana Smoothie )కూడా హెల్ప్ చేస్తుంది.ఈ స్మూతీ కోసం బ్లెండర్ లో ఒక కప్పు స్ట్రాబెర్రీ పండు ముక్కలు, ఒక కప్పు అరటిపండు ముక్కలు, వన్ టేబుల్ స్పూన్ పెరుగు మరియు ఒక గ్లాసు బాదం పాలు వేసుకుని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి.తద్వారా మన స్మూతీ రెడీ అవుతుంది.ఈ స్మూతీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.ముఖ్యంగా హెల్తీగా వెయిట్ గెయిన్ అవ్వడానికి తోడ్పడుతుంది.తక్కువ బరువు ఉన్నవారు ఈ స్మూతీని డైట్ లో చేర్చుకుంటే కొద్దిరోజుల్లోనే మంచిగా బరువు పెరుగుతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube