సూపర్‌స్టార్ మహేష్ తన నెక్స్ట్ సినిమాలో అభిమానులకు డబుల్ ధమాకా ఇవ్వనున్నాడు.అదేనండీ డబుల్ రోల్ చేయబోతున్నాడని సినీ వర్గాల సమాచారం.
ఇప్పటి వరకు ఏ సినిమాలో డబుల్ రోల్ చేయని సూపర్‌స్టార్ ఎ.ఆర్.మురగదాస్ చిత్రంలో డబుల్ రోల్ చేస్తున్నాడట.ప్రస్తుతం బ్రహ్మోత్సం సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్న మహేష్ ఈ సినిమాను ఈ నెలతో తన షూటింగ్ పార్ట్‌ను పూర్తి చేసి మురగదాస్ సినిమాను స్టార్ట్ చేస్తాడట.
భారీ బడ్జెట్‌తో మహేష్, మురగదాస్‌ల సినిమాను రూపొందించడానికి నిర్మాతలు ఎన్వీ ప్రసాద్, ఠాగూర్ మధు ప్లాన్ చేస్తున్నారు.హీరోయిన్ విషయంపై ఇంకా ఏ క్లారిటీ రాలేదు.బాలీవుడ్ హీరోయిన్స్ సహా చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి.హరీష్ శంకర్ సంగీతం అందించనుండగా ఐదుసార్లు నేషనల్ అవార్డును సొంతం చేసుకున్నసంతోష్ శివన్ ఈ సినిమాకు సినిమాటోగ్రఫీని అందిస్తున్నాడు.
సినిమాను జవనరిలో లాంచనంగా ప్రారంభిస్తారని సమాచారం.నాని సినిమాలో డబుల్ రోల్లో అలా మెరిసిన మహేష్, ఈ సినిమాలో పూర్తిస్థాయి డబుల్ రోల్ చేయబోతున్నాడట.
మరి కొన్నిరోజులు ఆగితే పూర్తి వివరాలు తెలుస్తాయి.