అవంటే చిరాకు పడుతున్న చరణ్‌

హీరోలు అంటే బాడీ ఫిట్‌గా ఉంచుకోవడంతో పాటు డ్యాన్స్‌లలో దుమ్ము రేపే విధంగా ఉండాలి.హీరో అయిన దగ్గర నుండి పర్సనాలిటీ డెవలప్‌ చేసుకోవడంతో పాటు, డాన్స్‌లలో మరింతగా ప్రావిణ్యం పొందేందుకు ప్రతి రోజు కూడా ప్రాక్టీస్‌ చేస్తూనే ఉండాలి.

 Ram Charan Hates Gym And Dances-TeluguStop.com

జిమ్‌తో పాటు ప్రతి రోజు డాన్స్‌ ప్రాక్టిస్‌ చేయడం అంటే తనకు చిరాకు అని, ఆ రెండు పేరు చెబితేనే నాకు అసహ్యం కలుగుతుందని హీరో రామ్‌ చరణ్‌ అంటున్నాడు.తాజాగా ఈయన సన్నిహితులతో మాట్లాడుతూ రోజు జిమ్‌ చేయడం, డాన్స్‌ ప్రాక్టీస్‌ చేయడం చిరాకు తెప్పిస్తుందని, కాని తప్పని పరిస్థితుల్లో చేయాల్సి వస్తుందని అసహనం వ్యక్తం చేశాడట.

సినిమాల్లో తన డాన్స్‌తో దుమ్ము రేపే చరణ్‌కు దాన్ని ప్రాక్టీస్‌ చేయడం అంటే అంత కోపమా అని ఆయన సన్నిహితులు సైతం షాక్‌ అవుతున్నారు.టాలీవుడ్‌ బెస్ట్‌ డ్యాన్సర్స్‌లో ఒక్కడైన చరణ్‌ ఇష్టం లేకుండానే ఇంతటి పేరును తెచ్చుకున్నాడా అని అనుకుంటున్నారు.

ఒక వేళ చరణ్‌ మనస్సు పెట్టి డాన్స్‌పై మరింతగా శ్రద్ద పెట్టి చేస్తే అద్బుతాలు జరుగుతాయేమో అని ఆయన అభిమానులు అంటున్నారు.మొత్తానికి జీవితంలో అస్సలు ఇష్టం లేని వాటిని ప్రతి రోజు చేస్తూ చరణ్‌ ఎంత కష్ట పడుతున్నాడో పాపం.

ఇక ఈయన ప్రస్తుతం తమిళ హిట్‌ చిత్రం ‘తని ఒరువన్‌’ రీమేక్‌కు సిద్దం అవుతున్నాడు.ఈ సినిమాను సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో అల్లు అరవింద్‌ నిర్మించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube