ప్రముఖ పారిశ్రామికవేత్త రామోజీరావ్, మరియు తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న సంగతి అందరికి తెలిసిందే.అయితే ఆ కోల్డ్ వార్ కాస్త సడన్ గా అమితమైన అభిమానంగా మారిపోయింది.
ఏం జరిగిందో, ఏమో తెలీదు కానీ మొత్తానికి వీళ్ళిద్దరూ ఒకటి అయిపోయారు.విషయం ఏమిటంటే గతంలో రామోజీ ఫిల్మ్ సిటీని లక్ష నాగళ్ళు పెట్టి దున్నిస్తా అంటూ సంచలన ప్రకటన చేసిన కేసీఆర్, ఇప్పుడు రామోజీ రావ్ ను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాడు.
ముఖ్యంగా రామోజీ భూముల రేట్లను పెంచే దిశగా పావులు కదుపుతున్నాడు.అందులో భాగంగానే రంగారెడ్డి జిల్లా పరిధిలో హయత్నగర్ మండలం కోహెడలో స్మార్ట్ సిటీని ప్రపంచస్థాయి సదుపాయాలతో నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఇందుకోసం నిర్మాణరంగంలో విశేష అనుభవం కలిగిన దుబాయ్ హోల్డింగ్స్ కంపెనీ ముందుకొచ్చింది.ఈ బృందానికి టీఎస్ఐఐసీ అధికారులు కోహెడ స్థలాన్ని చూపించారు కూడా.
దీంతో పాటు ఘట్కేసర్ మండలం బోడుప్పల్, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి అత్యంత సమీపంలో స్థలాలు కూడా పరిశీలించినా.రామోజీ కోసం కోహెడలోనే స్మార్ట్ సిటీ ఏర్పాటు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని ప్రభుత్వ అధికారుల నుంచి గుస గుసలు వినిపిస్తున్నాయి.
మరి ఏది ఎంతవరకు నిజమో తెలీదుకాని మొత్తని రామోజీతో యుద్దం కన్నా స్నేహమే మిన్న అని కేసీఆర్ ఆలోచిస్తున్నాలు సమాచారం.