ఏ రంగం చూసుకున్నా వారసత్వం అనేది పెద్ద పీటగా ఉంటుంది అనడంలో ఏ మాత్రం సందేహం లేదు.ముఖ్యంగా రాజాకీయాల్లో, మరియు సినిమాల్లో అయితే వారసత్వ ప్రభావం మరింత అధికంగా ఉంటుంది.
హీరో కు యక్టింగ్ వచ్చినా, రాకపోయినా, హీరో అందంగా ఉన్నా, లేకున్నా అతను పెద్ద పేరు ఉన్న హీరో వారసుడు అయితే చాలు అతన్ని నెత్తిన పెట్టుకుంటారు అభిమానులు.అయితే రాజకీయాల్లో సైతం అదే పంధా కొనసాగుతూ ఉంటుంది.
ఇంతవరకు బాగానే ఉన్నా తెలంగాణా ఎన్నికల్లో ఆ ప్రభావం ఎక్కడా కనిపించలేదు.గమ్మత్తు ఏమిటంటే పూర్తి రాజకీయ కుటుంబం వారైనప్పటికీ, అంతేకాకుండా తల్లులు, తండ్రులు రాజకీయాల్లో తలపండిన వారు అయినప్పటికీ పాపం వారసులకు మాత్రం చుక్క ఎదురయింది.
తాజాగా జరిగిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నికల్లో ఫలితాల్లో మాజీ కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ కుమార్తె సుహాసిని.మాజీ మంత్రి శంకర్రావు కుమార్తెతో పాటు.
ఎమ్మెల్యే సాయన్న కుమార్తె కూడా ఓటమి పాలైయ్యారు.మొత్తం ఎనిమిది వార్డులకు జరిగిన కంటోన్మెంట్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ నాలుగు స్థానాల్లో గెలుపొందగా.
రెండుస్థానాల్లో టీఆర్‌ఎస్ రెబల్ అభ్యర్థులు విజయం సాధించగా.మరో స్థానంలో కాంగ్రెస్.
ఇంకోస్థానంలో కాంగ్రెస్ రెబెల్ అభ్యర్థులు విజయం సాధించారు.పాపం వారసత్వ ఫొర్ములా ఇక్కడ వర్క్ ఔట్ కాలేదు.