కోలీవుడ్ సినిమాలు మంచి కథలతో వస్తుంటాయి.అలాంటి సినిమాలు చూస్తే మంచి ఫీలింగ్ కలుగుతుంది ఆ సినిమా అప్పుడే అయిపోయిందా, ఇంకా ఎక్స్‌టెండ్ చేస్తే బాగుంది కదా అని కూడా అనిపిస్తుంది.
ఇక సీక్వెల్ ట్రెండ్ మొదలయ్యాక బ్లాక్ బస్టర్ కోలీవుడ్ హిట్స్‌కు సీక్వెల్ చేయాలంటూ ప్రేక్షకులు విజ్ఞప్తి చేస్తున్నారు ముఖ్యంగా కొన్ని కోలీవుడ్ సినిమాల సీక్వెల్స్( Kollywood Sequels ) కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నారు.మూవీ మేకర్స్ కూడా వీటికి సీక్వెల్స్ చేస్తామని మాట ఇచ్చారు అవేవో తెలుసుకుందాం.
• ఖైదీ 2
లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో కార్తీ హీరోగా వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఖైదీ (2019)( Khaidi Movie ) సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.దీనికి సీక్వెల్ కూడా చేస్తామన్నట్లు లోకేశ్ కనకరాజు చెప్పారు.
దానికోసం ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ సినిమా మంచి కథతో వస్తే బాక్సాఫీస్ ని కచ్చితంగా షేక్ చేస్తుందని చెప్పవచ్చు.

• ఖాకీ 2
కార్తీక్ హీరోగా నటించిన ఖాకీ సినిమా( Khakee Movie ) సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.తమిళంలో ఈ థ్రిల్లర్ ఫిలిం పేరు తీరన్ అధిగారం ఒండ్రు. ఆపరేషన్ బవారియా కేసు సంఘటనల ఆధారంగా ఈ సినిమా తీశారు.దీనికి సీక్వెల్ కూడా ప్రకటించారు.2025లో ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ కానుంది.ఈ మూవీ విడుదల కోసం ఆడియన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు.

• ధ్రువ సీక్వెల్
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన 2016 యాక్షన్ థ్రిల్లర్ మూవీ “ధ్రువ” బ్లాక్ బాస్టర్ హిట్టైంది.ఇది “థాని ఒరువన్”( Thani Oruvan ) సినిమాకి రీమేక్.థాని ఒరువన్ 2 కూడా చేయడానికి దర్శక నిర్మాతలు ప్లాన్ చేశారు.అయితే ఇప్పటిదాకా అది రాలేదు.ఒకవేళ వస్తే పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ హిట్ అయ్యే అవకాశం ఉంది.

• సార్పట్ట పరంపర
పీరియడ్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ సార్పట్ట పరంపర (2021)( Sarpatta Parampara ) ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.2023, మార్చిలో దీనికి సీక్వెల్ ప్రకటించారు.ఫస్ట్ సినిమాని డైరెక్ట్ చేసిన పా.రంజితే దీన్ని డైరెక్ట్ చేయనున్నాడు.ఇందులోని “కబిలన్ మునిరత్నం” పాత్రను మళ్లీ నటుడు ఆర్య పోషించనున్నాడు.

• శివాజీ 2
శివాజీ సినిమా( Sivaji Movie ) చాలా వెరైటీగా ఉంటుంది.దీనికి సీక్వెల్ రావాలని ప్రేక్షకులు చాలాకాలంగా వెయిట్ చేస్తున్నారు.

• అపరిచితుడు
అపరిచితుడు సినిమా( Aparichitudu ) కూడా అద్భుతంగా ఉంటుంది దీనికి కొనసాగింపుగా మరో మంచి కథతో సినిమా చేస్తే అదిరిపోతుంది.విక్రమ్ హీరో అయితే ఇంకా ఈ మూవీ నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు.

• విదుతలై
వెట్రిమారన్ దర్శకత్వంలో వచ్చిన తమిళ చిత్రం విదుతలై (2023)( Viduthalai ) సూపర్ హిట్ అయింది.ఇందులో విజయ్ సేతుపతి, గౌతమ్ మీనన్ తదితరులు నటించారు.ఇది 1987 నాటి క్రైమ్ థ్రిల్లర్.ఇది జయమోహన్ రచించిన తునైవన్ అనే చిన్న కథ ఆధారంగా తీశారు.వేర్పాటువాద గ్రూపు నాయకుడిని అరెస్టు చేసే పనిలో ఉన్న పోలీసు కానిస్టేబుల్‌ను కథ చుట్టూ తిరుగుతుంది.ఫస్ట్ పార్ట్ రిలీజ్ కాగా దాని సీక్వెల్ కోసం ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

• ఇండియన్ త్రీ
ఇండియన్ సినిమాకి ఓ సీక్వెల్ ఆల్రెడీ రిలీజ్ అయింది కాకపోతే ఇది ఫ్లాప్ అయింది అయితే ఇండియన్ త్రీ( Indian 3 ) కోసం ఇప్పుడు ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.