గ్రాఫిక్స్‌తో వృద్ధ హీరోలను యంగ్ హీరోలుగా చూపించడమే మైనస్.. అందుకే ఇవి ఫెయిల్..?

సాధారణంగా సినిమాల్లో వయసు పైబడ్డ హీరోలను సైతం యంగ్ హీరోలుగా చూపించడానికే ప్రయత్నిస్తారు.ఒక్కొక్కసారి హీరో యంగర్ వెర్షన్లను సినిమాల్లో చూపించాల్సి వస్తుంది.

 Tollywood Heros With Graphics Chiranjeevi Prabhas Vijay Thalapathy Details, Toll-TeluguStop.com

కానీ సమయానికి వారి యంగర్ వెర్షన్ల వలె కనిపించే నటుల దొరకరు.అలాంటి సందర్భాల్లో గ్రాఫిక్స్ పై ఆధారపడుతుంటారు.

అసలైన హీరోలనే యువకులు లాగా చూపిస్తుంటారు.అయితే ఇలాంటి ప్రయోగాలు చేసి చాలామంది చేతులు కాల్చుకున్నారు.ఈ మూవీలకు గ్రాఫిక్స్‌తో వృద్ధ హీరోలను యంగ్ హీరోలుగా చూపించడమే మైనస్ అయింది.

• ఆచార్య

చిరంజీవి రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఆచార్య సినిమా( Acharya ) ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే.ఈ మూవీలో చిరు యంగర్ వెర్షన్‌ను గ్రాఫిక్స్ తోనే తెరపై చూపించారు.30 ఏళ్లలో చిరంజీవి( Chiranjeevi ) ఎలా ఉంటారో అలాంటి లుక్ కోసం గ్రాఫిక్స్ లో చాలా ట్రై చేశారు కానీ అది అంతగా నప్పలేదు.అదేదో యానిమేషన్ బొమ్మలాగా కనిపించింది.దీనివల్ల మూవీకి నెగటివ్ టాక్ వచ్చింది.సినిమా ఫెయిల్యూర్ లో ఇది కూడా ఒక ప్రధాన కారణం అయ్యింది.

Telugu Acharya, Adipurush, Chiranjeevi, Ghatikudu, Ghost, Graphics, Heroes Young

• ఘోస్ట్

శివ రాజ్ కుమార్ “ఘోస్ట్” సినిమా( Ghost Movie ) కూడా ఇలాంటివి గ్రాఫిక్స్ కారణంగానే నెగటివ్ టాక్ తెచ్చుకుంది.ఈ సినిమా లాస్ట్‌లో శివ రాజ్ కుమార్ ను యువకుడి లాగా చూపించారు కానీ అది మాత్రం అంతగా సెట్ కాలేదు.

Telugu Acharya, Adipurush, Chiranjeevi, Ghatikudu, Ghost, Graphics, Heroes Young

• ఆది పురుష్‌

ఈ సినిమాలో రాముడిలాగా కనిపించాలని ప్రభాస్‌( Prabhas ) ఫేస్‌ను చాలా స్లిమ్ గా తయారు చేశారు.గ్రాఫిక్స్ కూడా విపరీతంగా వాడేసారు.దీనివల్ల ఈ సినిమా మొత్తం ప్రభాస్ ఒక యానిమేషన్ బొమ్మలాగా కనిపించారు.

ఆయన రాముడి లుక్‌పై తీవ్రమైన ట్రోల్స్ వచ్చిన సంగతి తెలిసిందే.అతడే గ్రాఫిక్స్ ఫేస్ చూడటం భరించలేక ప్రేక్షకులు నెగిటివ్ రివ్యూస్ కూడా ఇచ్చారు.

మొత్తం మీద ఈ మూవీ ప్రభాస్ గ్రాఫిక్స్ లుక్ కారణంగానే ఫెయిల్ అయింది.కథ కూడా దీనికి బిగ్గెస్ట్ మైనస్.

Telugu Acharya, Adipurush, Chiranjeevi, Ghatikudu, Ghost, Graphics, Heroes Young

• ఘటికుడు

ఈ సినిమాలో హీరో సూర్యని( Surya ) 10-13 ఏళ్ల బాలుడి లాగా చూపించారు.ఈ లుక్ చాలా ఫన్నీగా ఉంటుంది దీన్ని చూసి చాలా మంది నవ్వుకున్నారు కూడా అయితే సినిమా స్టోరీ బాగుండటం వల్ల ఈ మూవీకి పెద్దగా నెగిటివిటీ రాలేదు.

Telugu Acharya, Adipurush, Chiranjeevi, Ghatikudu, Ghost, Graphics, Heroes Young

• కల్కి 2898 AD

ఈ సినిమాలో అమితాబ్‌ బచ్చన్( Amitabh Bachchan ) యంగర్ వెర్షన్ ను కూడా గ్రాఫిక్స్ తోనే క్రియేట్ చేశారు.చూసేందుకు ఇది బాగానే అనిపించింది కానీ కొంతమంది మాత్రం ట్రోల్ చేశారు.క్లియర్ గా యానిమేషన్ కనిపిస్తుంది అంటూ నెగిటివ్ కామెంట్ చేశారు.

Telugu Acharya, Adipurush, Chiranjeevi, Ghatikudu, Ghost, Graphics, Heroes Young

• గోట్

విజయ్( Vijay ) హీరోగా నటించిన గోట్ సినిమాలో( Goat Movie ) యంగర్ విజయ్ క్యారెక్టర్‌ను గ్రాఫిక్స్ తో యువకుడిగా చూపించేందుకు ప్రయత్నించారు కానీ అది బెడిసి కొట్టింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube